Malayalam Actress Ambika Rao Died Due To Heart Attack At Age 58 - Sakshi
Sakshi News home page

Actress Ambika Rao Death: గుండెపోటుతో ప్రముఖ నటి కన్నుమూత..

Jun 28 2022 12:39 PM | Updated on Jun 28 2022 2:38 PM

Malayalam Actress Ambika Rao Dies Of Heart Attack At 58 - Sakshi

గత కొంతకాలంగా ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న ఆమె సోమవారం (జూన్‌ 27) రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల మలయాళ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, టోవినో థామస్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. 

Malayalam Actress Ambika Rao Dies Of Heart Attack At 58: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీల్లో తరచుగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ నటి అంబికా రావు (58) గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా ఎర్నాకులంలోని ఓ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న ఆమె సోమవారం (జూన్‌ 27) రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల మలయాళ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, టోవినో థామస్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. 

2022లో బాలచంద్ర మీనన్‌ 'కృష్ణ గోపాలకృష్ణ' సినిమాతో సహాయ దర్శకురాలిగా చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. తర్వాత తొమ్మనుమ్‌ మక్కలుమ్‌, సాల్ట్ అండ్‌ పెప్పర్‌, రాజమాణికం, వెల్లినక్షత్రం సినిమాలకు సహాయదర్శకురాలిగా పనిచేశారు. అనంతరం తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. వీటిలో కుంబళంగి నైట్స్‌ ఒకటి. అలాగే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించి, విడుదలకు సిద్ధంగా ఉన్న 'కడువా', టోవినో థామస్‌తో కలిసి 'వైరస్‌' సినిమాలో అంబికా నటించారు.

చదవండి: నా ప్రతి అడుగులో అతను ఉన్నాడు: యంగ్‌ హీరోయిన్‌
ఈవారం అలరించే సినిమాలు / సిరీస్‌లు..
తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement