ఎనిమిది నెలల గర్భిణి.. నటి కన్నుమూత.. | Pregnant Malayalam TV Actress Priya Passed Away at 35 | Sakshi
Sakshi News home page

Dr Priya: ఎనిమిది నెలల గర్భిణి.. గుండెపోటుతో కుప్పకూలిన నటి.. ఐసీయూలో శిశువు

Nov 1 2023 3:33 PM | Updated on Nov 1 2023 3:54 PM

Pregnant Malayalam TV Actress Priya Passed Away at 35 - Sakshi

ప్రియ గుండెపోటుతో మరణించింది. అప్పుడే పుట్టిన శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి అమాయక మనుషులకు దేవుడు ఎందుకింత అన్యాయం చే

మలయాళ చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. బుల్లితెర నటి రెంజూష మీనన్‌ మరణవార్త మరువకముందే మరో బుల్లితెర నటి, డాక్టర్‌ ప్రియ(35) గుండెపోటుతో మరణించింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన ప్రియ ప్రెగ్నెన్సీ చెకప్‌లో భాగంగా ఇటీవలే ఆస్పత్రికి వచ్చింది. ఇంతలోనే ఆమెకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేసి గర్భంలో ఉన్న శిశువును బయటకు తీశారు. శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రియను మాత్రం బతికించలేకపోయారు.

ప్రియ మరణవార్తను నటుడు కిషోర్‌ సత్య సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. 'ప్రియ గుండెపోటుతో మరణించింది. అప్పుడే పుట్టిన శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి అమాయక మనుషులకు దేవుడు ఎందుకింత అన్యాయం చేశాడో అర్థం కావట్లేదు. 35 ఏళ్లకే ఆమెకు నిండునూరేళ్లు నిండిపోయాయా? ఈ బాధ నుంచి ఆమె తల్లి, భర్త ఎలా బయటపడగలరు? వారికి భగవంతుడు ఈ బాధను తట్టుకోగలిగే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

చదవండి: స్టేజీపై బాగా నటించావ్‌.. శెభాష్‌ బండ్ల గణేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement