Love Today Actress Ivana Faced Body Shaming - Sakshi
Sakshi News home page

బిగ్‌ హీరోతో సినిమా ఛాన్స్‌.. ఈ ఒక్క కారణంతో నన్ను తొలగించారు: యంగ్‌ హీరోయిన్‌

Published Mon, Aug 7 2023 2:39 PM | Last Updated on Mon, Aug 7 2023 3:07 PM

Love Today Actress Ivana Faced Body Shaming - Sakshi

‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కేరళ బ్యూటీ ఇవాన. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాటలో మొదట విడుదలైన ఈ చిత్రం తర్వాత తెలుగులో కూడా విడుదలైంది.  ఈ సినిమాను కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. రూ.60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తమిళ్‌లో చరిత్ర సృష్టించింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన ఇవానకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నిర్మించిన lgm చిత్రంతో ఇవాన మళ్లీ తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే ఇవానా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

(ఇదీ చదవండి: పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబంలో విషాదం.. గుండెపోటుతో స్పందన మృతి)

ఇవానా తక్కువ ఎత్తు ఉండటం వల్ల తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవడమే కాకుండా వచ్చిన సినిమా అవకాశాలను కూడా కోల్పోయానని తెలిపింది. అలాంటి సమయంలో చాలా బాధ కలిగిందని ఆమె చెప్పింది. వారు శారీరక రూపం గురించి ఎందుకు మాట్లాడుతారు అని తనలో తాను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానని పేర్కొంది. అలా బాధలో ఉన్న తనకు ఒకరోజు కన్నడలోని ఒక బిగ్‌ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కింది. సినిమా పూజా కార్యక్రమం కూడా చేశారు. కానీ ఆఖరి నిమిషంలో హీరో పక్కన తన ఎత్తు సరిపోదని చెప్పి తిరష్కరించారని ఇవాన చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: బాబు.. నువ్వే మా జీవితంలో వెలుగు నింపావ్‌..నిహారిక పోస్ట్‌ వైరల్‌)

లవ్ టుడే సినిమా విడుదల సమయంలో కూడా తాను బాడీ షేమింగ్ గురించి ఎదుర్కొన్నానని ఇవానా ఇలా వెల్లడించింది. 'నేను పొట్టిగా ఉన్నానని అందరూ అంటారు. స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు కూడా అలానే అనిపించింది. స్కూల్‌ అసెంబ్లీ ఏర్పాటు సమయంలో నన్నే ముందు వరసలో నిల్చోబెట్టేవారు.. ఎందుకంటే నేను హైట్‌ తక్కువని. అదంతా చిన్న క్లాసులో నుంచే నాకు అనుభవమే. ఒక్కోసారి స్నేహితులు ఎగతాళి చేసినప్పుడు దాని ప్రభావం రోజంతా ఉంటుంది.' అని ఇవానా తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement