![Malayalam TV Actress Lekshmi Pramod Dance Before Going to Labour Room - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/26/malayalam-tv-actress-lekshmi-pramod-dance-01.jpg.webp?itok=R2zToMOl)
ప్రెగ్నెన్సీ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే కాలు తీసి అడుగు ముందుకువేయడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. మరికొందరేమో వ్యాయామాలు, రన్నింగ్‌లు చేస్తూ సర్‌ప్రజ్ చేస్తుంటారు. తాజాగా మలయాళ బుల్లితెర నటి లక్ష్మి ప్రమోద్ కూడా ఇలాంటి పనే చేసింది. స్వతహాగా డ్యాన్సర్ కావడంతో లేబర్ రూమ్‌కు వెళ్లేముందు చిందులేసింది. నిండు గర్భిణి అన్న విషయాన్ని మర్చిపోయి హాయిగా డ్యాన్స్ చేసింది.
దీన్ని ఆమె భర్త అజర్ మహ్మద్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియోను నటి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. లేబర్ రూమ్‌కు వెళ్లేముందు ఒక రీల్ చేస్తే బాగుంటుందనిపించింది. అయినా డ్యాన్స్ చేసుకుంటూ లేబర్ రూమ్‌కు వెళ్తావా? అని అడిగారుగా.. వారికోసమే ఈ వీడియో అని రాసుకొచ్చింది.
ఇది చూసిన కొందరు డెలివరీ తర్వాత కూడా ఇలాగే డ్యాన్స్ చేయ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తర్వాత నటికి పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చదవండి: ఆ సినిమా 14 సార్లు చూశా.. డైలాగ్ చెప్తూ తడబడ్డ నందమూరి హీరో!
Comments
Please login to add a commentAdd a comment