
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చియన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ గతంలో ఎప్పుడు చూడని లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఇవాళ హీరోయిన్ మాళవిక మోహనన్ ఎక్స్ వేదికగా అభిమానులతో ఆస్క్ మాళవిక అనే సెషన్ నిర్వహించారు. ఇందులో చాలామంది ఫ్యాన్స్ ఆమెను ప్రశ్నించారు. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఓ నెటిజన్ ఏకంగా మాళవిక పెళ్లి గురించి ఆరా తీశారు. మీరెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అంటూ పోస్ట్ చేశారు. దీనిపై మాళవిక స్పందిస్తూ.. నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు? అంటూ గట్టిగానే రిప్లై ఇచ్చేసింది. మరికొందరు తంగలాన్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా.. తంగలాన్ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. అ
Why you in a rush to see me married? :( https://t.co/epaOAhywvs
— Malavika Mohanan (@MalavikaM_) July 31, 2024