
ఈ నటి పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. డ్యాన్స్, నటనల మధ్య పెళ్లి విషయాన్ని మర్చిపోయిందా? అంటే...
లక్ష్మీ గోపాలస్వామి.. నటిగా కన్నా కూడా భరతనాట్య కళాకారిణి అని పిలిపించుకోవడమే ఆమకు ఇష్టం. నాట్యం ద్వారానే కళ్లతో పలు భావాలను అవలీలగా పలికించగల నైపుణ్యాన్ని ఒడిసిపట్టుకుంది. తన అభినయంతో మలయాళ, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి పేరు సంపాదించుకుంది. సెకండ్ హీరోయిన్‌గా ఎక్కువ సినిమాలు చేసిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయింది. తెలుగులో అరవింద సమేత వీరరాఘవ, సైరా సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెరపైనా సందడి చేస్తోంది.
సరైనవాడు దొరకలేదు
ఆదివారం(జనవరి 7న) ఈ నటి బర్త్‌డే. 54 ఏళ్ల వయసున్న ఈ నటి ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. డ్యాన్స్, నటనల మధ్య పెళ్లి విషయాన్ని మర్చిపోయిందా? అని అప్పట్లో చాలామంది గుర్తు చేశారు. దీనికి సదరు నటి స్పందిస్తూ.. 'నా అందం చూసి, సమాజంలో నా గౌరవం చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేవారు నాకవసరం లేదు. ఇవేవీ లేకపోయినా నన్ను నన్నుగా ఇష్టపడేవాడినే పెళ్లి చేసుకుంటాను. అది కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికైతే సరైనవాడు దొరకలేదు' అని చెప్పింది.
ఎప్పటికీ సింగిల్‌గానే..
ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా మళ్లీ పెళ్లి ఊసే ఎత్తలేదు లక్ష్మి. ఇప్పుడేకంగా పెళ్లీడు దాటిపోవడంతో వివాహం గురించే ఆలోచించడం లేదని చెప్తోంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే వయసు కాదని, దాని గురించి అడగొద్దని విన్నపిస్తోంది. ఇది విన్న జనాలు ఇక లక్ష్మి ఎప్పటికీ సింగిల్‌గానే ఉంటుందా! అని మాట్లాడుకుంటున్నారు.
చదవండి: వర్మ ఆడిషన్‌కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు