Parvathy Jayaram a Heartwrenching Post on Her Pet Dog Demise - Sakshi
Sakshi News home page

Parvathy Jayaram: మాపై ఎంతో ప్రేమ చూపించావు, నిన్ను వదిలి ఉండటం ఊహించలేకపోతున్నా..

Published Thu, Jun 22 2023 8:03 PM | Last Updated on Thu, Jun 22 2023 8:53 PM

Parvathy Jayaram Heart Wrenching Post on Her Pet Dog Demise - Sakshi

మలయాళ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ పార్వతి జయరామ్‌. 70కు పైగా సినిమాలు చేసిన ఆమె హీరో జయరామ్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి కాళిదాస్‌, మాళవిక అని ఇద్దరు సంతానం. కుటుంబం కోసం భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదని, అందుకే తాను సినిమాలకు దూరమయ్యానని గతంలో చెప్పుకొచ్చింది పార్వతి.

తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేసింది. తన పెంపుడు శునకం చనిపోవడంతో దానితో కలిసి ఆడుకున్న క్షణాలకు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేస్తూ ఎమోషనలైంది నటి. 'మెస్సిమ్మ.. మాటలు రావడం లేదు. 40 రోజుల బేబీగా నా దగ్గరకు వచ్చావు. నాపై ఎనలేని ప్రేమ కురిపించావు. నన్నొక ఉత్తమ వ్యక్తిగా మలిచావు. నీ చిలిపి చేష్టలను, సాంగత్యాన్ని మిస్‌ అవుతాను. ఆ భగవంతుడు నిన్ను నాకు ఒక కొడుకుగా ఇచ్చాడు.. అలాంటిది ఇప్పుడు నిన్ను వదిలి ఉండటం అనేది ఊహించుకోలేకపోతున్నాను.

నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది. ఇప్పుడు నువ్వు ఆ నింగిలోని ప్రకాశవంతమైన నక్షత్రాల్లో ఒకటిగా మిగిలిపోయావేమో.. ఎక్కడున్నా కూడా అదే చిలిపితనంతో అంతే సంతోషంగా ఉండాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. ఇట్లు నీ అమ్మ, నాన్న, కన్నన్‌, చక్కి' అని ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. ఇది చూసిన అభిమానులు పెంపుడు కుక్క అంటే ఎంత ఇష్టమో అని కామెంట్లు చేస్తున్నారు.


చదవండి: కోడలితో కలిసి కొడుకు టార్చర్‌.. పోలీసులను ఆశ్రయించిన నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement