
ఆరుబయట పచ్చని మొక్కల దగ్గర బికినీలో షవర్ స్నానం చేసింది. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు.
మలయాళ హీరోయిన్ సానియా అయ్యప్పన్ నటించిన క్వీన్, లూసిఫర్ సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ప్రకృతిలో స్నానం చేసింది. ఆరుబయట పచ్చని మొక్కల దగ్గర బికినీలో షవర్ స్నానం చేసింది. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు.
'ఛీఛీ, బయట స్నానం చేస్తున్న వీడియోలు షేర్ చేస్తున్నావు, నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇలాగయితే ఈవ్ టీజింగ్ కేసులు ఇంకెలా తగ్గుతాయి?' అని ఫైర్ అయ్యాడు. ఇది చూసిన సానియా.. అసలు సిగ్గంటే ఏంటో చెప్తారా? అని సెటైరిక్‌గా కౌంటర్ ఇచ్చింది. దీంతో పలువురు నెటిజన్లు హీరోయిన్‌కు మద్దతు తెలుపుతుండగా మరికొందరు మాత్రం ఆ సిగ్గు లేకనే ఇలా చేస్తున్నావంటూ దుయ్యబడుతున్నారు. కాగా సానియా ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ సరసన 'సెల్యూట్' మూవీలో నటిస్తోంది.