Malayalam Actress Anumol about her 'Ayali' web series success - Sakshi
Sakshi News home page

Actress Anumol: అది నాకు తెలిసిన జీవితం!: హీరోయిన్‌ అనుమోల్‌

Published Thu, Feb 23 2023 8:46 AM | Last Updated on Thu, Feb 23 2023 9:11 AM

Malayalam Actress Anumol About her Ayali Web Series Success - Sakshi

తమిళసినిమా: మలయాళంలో విభిన్న పాత్రలను పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నటి అనుమోల్‌. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. కథానాయకి పాత్రల్లోనే నటిస్తానని బెట్టు చేయకుండా నచ్చిన, నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఇంతకు ముందు తమిళంలో ఒరు ఇరవిల్‌ చిత్రంలో నటించిన అనుమోల్‌ ఇటీవల ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణను పొందుతున్న అయిలీ వెబ్‌ సిరీస్‌లో అమ్మగా ముఖ్య పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు.

ఈ సందర్భంగా ఈ బహుభాషా నటిని పలకరించగా అయిలీ చిత్రం ఇంత మంచి విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదన్నారు. ఇందులో పాత్ర గురించి దర్శకుడు ముత్తుకుమార్‌ చెప్పినప్పుడు దీన్ని వదులుకోరాదని భావించానన్నారు. ఎందుకంటే ఆ పాత్ర తనకు తెలిసిన జీవితం అన్నారు. తన తల్లికి తనకు మధ్య జరిగినదేనని చెప్పారు. ఇది అందరికీ చెప్పాల్సిన కథ అని అభిప్రాయపడ్డారు. ఈ వెబ్‌ సిరీస్‌కు వస్తున్న ప్రశంసలు యూనిట్‌ అందరికీ చెందుతాయన్నారు. తమిళంలో ఎక్కువగా నటించకపోవడానికి కారణం మంచి అవకాశాలు రాకపోవడమేననీ, ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయనీ చెప్పారు.

నిజం చెప్పాలంటే తన సినీ పయనం తమిళ చిత్ర పరిశ్రమ నుంచే ప్రారంభం అయ్యిందని చెప్పారు. తాను నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ తమిళ ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అయ్యిందన్నారు. తమిళంలో అందరి దర్శకుల చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటన్నానన్నారు. అదే విధంగా ఇటీవల సూర్య నటించిన జైభీమ్‌ చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. అయిలీ వెబ్‌ సిరీస్‌ తెలుగులోనూ స్ట్రీమింగ్‌ అవుతోందని, దీంతో అక్కడ కూడా అవకాశాలు వస్తాయని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం మలయళంలో తాను నటించిన  థా ధవలయుడే థా, పెండులం, తమిళంలో ఫర్హానా చిత్రం విడుదలకు సిద్ధం అవుతోందన్నారు. మరి కొన్ని నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్నాయన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement