
మలయాళ నటి అంజలి నాయర్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో పాపను ఇప్పుడప్పుడే చూపించనీయకుండా జాగ్రత్తపడిందీ నటి. కాగా అంజలి గతంలో ఫిలింమేకర్ అనీష్ ఉపాసనను పెళ్లాడింది. వీరికి అవని అనే కూతురు కూడా ఉంది. ఆమె 5 సుందరానికీ అనే సినిమాలోనూ నటించింది. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంలో వీరికి విడాకులయ్యాయి.
తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అజిత్ రాజుతో ప్రేమలో పడింది అంజలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరు పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు. పెళ్లైన ఐదు నెలలకే పాపకు జన్మనివ్వడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భర్త, కూతురితో కలిసి మెటర్నటీ ఫొటో షూట్ చేసిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ రెండోసారి బిడ్డ పుట్టిందంటూ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపోతే అంజలి అన్నాత్తే మూవీలో రజనీకాంత్ తల్లి పాత్రను పోషించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పటివరకు ఆమె అన్ని భాషల్లో కలిపి 125కు పైగా సినిమాల్లో నటించింది.
చదవండి: ‘మోసపూరితమైన అతని ఆలోచనలను అంచనా వేయడం ఎవరితరం కాదు!’
నన్ను బతికుండగానే చంపి రాక్షసానందం పొందుతున్నారు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment