
క్లాసికల్ డ్యాన్సర్, ప్రముఖ నటి కపిల వేణుకు చేదు అనుభవం ఎదురైంది. ఓ గుడిలో తన ఫ్రెండ్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటానికి వెళ్లగా.. ఊహించని అనుభవం తనకు ఎదురైందని చెప్పుకొచ్చింది. ఈ మేకరు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అసలేం జరిగిందో చెబుతూనే తనే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందని తనని తాను సముదాయించుకుంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)
'నా స్నేహితురాలి డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటం కోసం లోకల్‌గా ఉండే ఓ గుడికి ఒంటరిగా వెళ్లాను. అక్కడ ఆల్రెడీ ఉత్సవం జరుగుతోంది. దారి తెలియక అందరూ బయటకు వచ్చే దారి నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాను. అయితే అక్కడే ఉన్న ఓ వాలంటీర్.. నన్ను టచ్ చేసి ఆపాడు. చాలా రూడ్‌గా మాట్లాడాడు. ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా ఇలా చేయడం ఏంటని కాస్త గట్టిగానే అడిగాను. ఇద్దరు మధ్య కాస్త వాదన జరిగింది. ఈ టైంలో మరో ఆరుగురు వాలంటీర్లు మేమున్న చోటుకు వచ్చారు. వాళ్లందరూ కూడా నాదే తప్పన్నట్లు చెప్పారు. సీన్ చేయకుండా, వెంటనే వెళ్లిపోవాలని కామెంట్ చేశారు'
'దీంతో ఏడుస్తూ పోలీసుల దగ్గర వెళ్లాను. ఆ తర్వాత కమిటీ మెంబర్లలో ఒకాయన వచ్చి వాలంటీర్లతో మాట్లాడి, నా తండ్రి పేరు తెలుసుకుని నన్ను లోపలికి పంపించేశాడు. ఇంకేదో జరుగుతుందనుకుంటే నాన్న పేరు తెలుసుకుని లోపలికి పంపేయడం నాకు నిజంగా నచ్చలేదు. అయినా గుడికి ఒంటరిగా వెళ్లాలనుకోవడం నాది తప్పు. జనాలు ఎక్కువగా వచ్చారు. వాళ్లని కంట్రోల్ చేయడం వాలంటీర్లకు కష్టమే. అయినా సరే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది' అని వేణు కపిల ఇన్ స్టాలో రాసుకొచ్చారు.
(ఇదీ చదవండి: ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య)
Comments
Please login to add a commentAdd a comment