![Malayalam Actress Bhama Acts In Only One Tollywood Movie - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/16/bhama.jpg.webp?itok=WFes0TG_)
నివేద్యం సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భామ. ఈ భామ తన అందంతో మలయాళంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. మలయాళంతో పాటు కన్నడ,తమిళం చిత్రాల్లో నటించింది. సినిమాల్లో సక్సెస్ సాధించిన భామ.. తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే చేసింది. టాలీవుడ్ హీరో తనీశ్ నటించిన మంచివాడు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు లక్ష్మి నారాయణ దర్శకత్వం వహించారు. తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయినప్పటికీ తమిళం, కన్నడ, మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది.
అయితే పెళ్లయ్యాక నటనకు కాస్త దూరంగా ఉన్న భామ.. గతంలో భర్తతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇలాంటి వాటిపై ఆమె కనీసం స్పందించలేదు. 2018లో చివరిసారిగా ఖిలాఫత్ అనే మలయాళ చిత్రంలో నటించిన భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment