![Lijomol Jose About Comments On Short Hair](/styles/webp/s3/article_images/2024/06/20/actress.jpg.webp?itok=yM_rJ4lS)
లిజొమోల్ జోస్, శృతి రామచంద్రన్
ఈరోజుల్లో సెలబ్రిటీలు ఏం చేసినా తప్పయిపోతోంది. నచ్చిన డ్రెస్ వేసుకున్నా, హెయిర్ కట్ చేసుకున్నా, ఏదైనా కొత్తగా ట్రై చేసినా.. జనాలకు నచ్చలేదంటే చాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జై భీమ్ నటి లిజొమోల్ జోస్‌ను ఇలాగే విమర్శించారట.
![లిజొమోల్ జోస్](/sites/default/files/inline-images/lijo.jpg)
లిజొమోల్ జోస్
దాని గురించి ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్యే నేను నా హెయిర్ కట్ చేసుకున్నాను. అది నా ఇష్టం. కానీ అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. కొందరైతే నీ జుట్టు ఎందుకు కత్తిరించుకున్నావు? అని ప్రశ్నిస్తున్నారు. చిన్నగా ఉంటే బాగుంటుందనిపించింది, కట్ చేసుకున్నాను. దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది.
![శృతి రామచంద్రన్](/sites/default/files/inline-images/sruthi.jpg)
శృతి రామచంద్రన్
అదే ఇంటర్వ్యూలో ఉన్న నటి శృతి రామచంద్రన్ మాట్లాడుతూ.. జనాలతో ఇదే సమస్య.. నేను, మా ఆయన కనిపిస్తే చాలు, మీకు పిల్లలెందుకు లేరు? అని అడుగుతారు. వాళ్ల జీవితాల గురించి వాళ్లు ఎంత ఆలోచిస్తారో తెలీదు కానీ పక్కవారి గురించి మాత్రం మరీ ఎక్కువ ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చింది. కాగా శృతి రామచంద్రన్.. తెలుగులో డియర్ కామ్రేడ్ మూవీలో యాక్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment