అలా చేస్తే ఈ సమాజం నన్ను బతకనిస్తుందా?: నటి | Malayalam Actress Suchitra Nair About Her Break Up Story - Sakshi
Sakshi News home page

𝙎𝙪𝙘𝙝𝙞𝙩𝙝𝙧𝙖 𝙉𝙖𝙞𝙧: అతడికోసం ఎన్నో వదులుకున్నాను.. నన్ను నేనే అసహ్యించుకున్నా..

Published Wed, Jan 24 2024 12:05 PM | Last Updated on Wed, Jan 24 2024 12:48 PM

Malayalam Actress Suchitra Nair About Her Lover Break up Story - Sakshi

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మలైకొట్టై వాలిబన్‌. గురువారం (జనవరి 25న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది బిగ్‌బాస్‌ బ్యూటీ సుచిత్ర నాయర్‌. మలయాళ ఇండస్ట్రీలో ఇదే తనకు తొలి సినిమా కావడం విశేషం. తాజాగా ఈ నటి తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది.

బోలెడు కథలు విన్నాను..
'బిగ్‌బాస్‌ షోలో నన్ను చూసిన డైరెక్టర్‌ లిజో సర్‌.. తన సినిమాలో ఆఫర్‌ ఇచ్చాడు. అదే 'మలైకొట్టై వాలిబన్‌'. నా తొలి సినిమా ఇంత పెద్ద బడ్జెట్‌లో ఉండటం, గొప్ప నటీనటులతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య ఈ మూవీలో నుంచి విడుదలైన పాటలో మోహన్‌లాల్‌తో పాటు నేనూ ఉన్నాను. అది చూసి చాలామంది నాకు సినిమా ఆఫర్లు ఇచ్చారు. బోలెడన్ని కథలు విన్నాను కానీ ఇంతవరకు ఏదీ ఓకే చేయలేదు. వాలిబన్‌ రిలీజయ్యాక మంచి కథలు సెలక్ట్‌ చేసుకుంటాను. మలయాళంలో మంచి సినిమాలు చేయాలనుంది.

గాఢంగా ప్రేమించాను.. బ్రేకప్‌..
ఇక పెళ్లంటారా? వివాహంపైన నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. కానీ పెళ్లి చేసుకోకపోతే నా కుటుంబం, ఈ సమాజం ఊరుకుంటుందా? పదేపదే గుర్తుచేస్తూనే ఉంటుంది. పెళ్లి అవసరం లేదనుకున్నాను కానీ జీవితాంతం ఈ ఒత్తిడి భరించడం నా వల్ల కాదు. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడు దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. అయినా ఇప్పటికీ నేను నా బ్రేకప్‌ బాధలో నుంచి పూర్తిగా బయటపడలేదు. మొదట్లో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ అతడు నాకు చాలా కండీషన్స్‌ పెట్టేవాడు. నచ్చిన దుస్తులు వేసుకోనిచ్చేవాడు కాదు, బయట తిరగనిచ్చేవాడే కాదు. నేను ఏం మాట్లాడినా అడ్డుపడేవాడు.

తనకోసం ఎంతో చేశా..
నాకు నచ్చినట్లుగా బతకనివ్వలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఏం చేయాలన్నా తన అనుమతి తప్పనిసరి. నన్ను నన్నుగా ఉండనివ్వలేదు. మా మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయాం. పంజరంలో నుంచి బయటకు వచ్చినట్లుగా అనిపించింది. తన కోసం ఎన్నో అవకాశాలను వదిలేసుకున్నాను. చేయాల్సిన పనులు వాయిదా వేసుకున్నాను. ఇలాంటి వ్యక్తిని ప్రేమించానా? అని నన్ను నేనే అసహ్యించుకున్నాను' అని చెప్పుకొచ్చింది సుచిత్ర. కాగా సుచిత్ర నాయర్‌.. వానంబడి సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో విలన్‌గా మెప్పించిన ఆమె మలయాళ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొంది.

చదవండి: ఓటీటీలో అదరగొడుతున్న 'నెరు' సినిమా ఎలా ఉందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement