![Actress Anjali Nair Accused Her Co Star Of Misbehaving With Her - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/18/anjali.jpg.webp?itok=jf2gXLf4)
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తె', మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 'మామనిథన్' చిత్రాలతో పేరు తెచ్చుకున్న మలయాళ భామ అంజలి నాయర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన సహా నటుడు లైంగిక వేధింపులకు గురి చేశాడని తెలిపింది. అతడి వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించినట్లు నటి వెల్లడించింది. కాగా.. అంజలి మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.
అంజలి నాయర్ మాట్లాడుతూ.. 'నాది కేరళ అయినప్పటికీ తమిళ భాష బాగా తెలుసు. ఆ కారణంగానే నేను తమిళ చిత్రాల్లో నటించాలనుకున్నా. నా మొదటి తమిళ చిత్రంలో నటిస్తున్నప్పుడు విలన్ పాత్ర పోషిస్తున్న నటుడు అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. అతను ఆ చిత్రానికి సహ-నిర్మాత కూడా. షూటింగ్ అయిపోయినా నన్ను సెట్ నుంచి వెళ్లనివ్వలేదు. నన్ను ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఒకసారి నన్ను రైలు నుంచి తోసి చంపడానికి ప్రయత్నించాడు. నన్ను రకరకాలుగా వేధిస్తూనే ఉన్నాడు. అతని వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించా. ఆ కారణంగా కేరళకు తిరిగి వెళ్లా' అని అన్నారు. అంజలి ప్రకటనతో సినీ పరిశ్రమలో దుమారం రేపింది.
అంజలి వ్యక్తిగత విషయానికి వస్తే.. అంజలి నాయర్ 2011లో అనీష్ అనే ఫిల్మ్ మేకర్‌ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనితో విడాకులు తీసుకుంది. గతేడాది అజిత్ అనే అసిస్టెంట్ డైరెక్టర్‌ని పెళ్లి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment