బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ లిస్ట్‌లో దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి. ఆరేళ్ల పాటు డేటింగ్ చేసిన రణ్ వీర్ సింగ్, దీపికా.. 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. ఇటీవల ఈ జంట తమ ఐదో వివాహ వార్షికోత్సవాన్ని బెల్జియంలో ఘనంగా జరుపుకుంది. అయితే పెళ్లి చేసుకొని ఐదేళ్లు గడుస్తున్నా..ఇప్పటి వరకు ఈ జంటకు పిల్లలు లేరు. వరుస సినిమాలతో బిజీగా ఉండడం కారణంగా కొన్నాళ్ల పాటు పిల్లలను కనకుండా ఉండాలని ఈ జంట భావించిందట. అయితే ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై దీపికా పదుకొణె పరోక్షంగా స్పందించారు. పిల్లలు అంటే తనతో పాటు రణ్‌వీర్‌కు చాలా ఇష్టమని, సొంత కుటుంబాన్ని ప్రారంభించడం కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని చెప్పింది. అంతే కాదు తన పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నారో కూడా దీపికా చెప్పుకొచ్చింది. ‘నేను ఇప్పుడు ఎవరినైనా కలిస్తే చాలా ఎదిగిపోయావని పొగిడేస్తుంటారు. కానీ మా బంధువులు మాత్రం నన్ను ఒక సెలెబ్రిటీలా ట్రీట్ చేయరు.
సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నావో..ఇప్పుడు అలానే ఉన్నావని అంటుంటారు. మొదట నేను ఒక కూతురిని.. ఒక సోదరిని.. ఆ తర్వాతే సెలబ్రెటీని! ఫేమ్ వచ్చాక మన ప్రవర్తనలో మార్పు రాకూడదు. మా పేరెంట్స్ నన్ను అలానే పెంచారు. మా పిల్లల్ని కూడా రణ్‌వీర్, నేను అలానే పెంచాలనుకుంటున్నాం. మా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలనుకుంటున్నాం’అని దీపికా చెప్పుకొచ్చింది. దీపికా సినిమాల విషయాకొస్తే.. పఠాన్, జవాన్ చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కీ 2898’తో పాటు శెట్టి దర్శకత్వంలో 'సింగం ఎగైన్'లోనూ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment