స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తల్లి కాబోతుందా? అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే తాజాగా ఈ వార్తలకు బలమొచ్చేలా కొన్ని హింట్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ బ్యూటీ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రెగ్నెన్సీతో ఉందా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత?
దీపికా పదుకొణె పేరు చెప్పగానే హిందీ హీరోయిన్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఈమె పుట్టి పెరిగిందింతా బెంగళూరులోనే. కన్నడ సినిమాతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది గానీ హిందీలో వరస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం 'కల్కి'లో ప్రభాస్ సరసన నటస్తోంది. హిందీలో 'సింగం రిటర్న్స్'లో మాత్రమే చేస్తోంది.
(ఇదీ చదవండి: బాలీవుడ్‌లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి)
తాజాగా ఇంటర్నేషనల్ మూవీ అవార్డుల వేడుక 'బాఫ్టా'లో పాల్గొన్న దీపిక.. చీరకట్టులో కనిపించింది. అయితే ఈమెని సరిగా అబ్జర్వ్ చేస్తే బేబీ బంప్ ఉందేమోననే సందేహం వచ్చింది. తాజాగా ముంబయి తిరిగొచ్చేసిన దీపిక.. వదులుగా ఉండే ఔట్‌ఫిట్‌లో కనిపించింది. వీటితో పాటు దీపిక ప్రెగ్నెన్నీతో ఉందనే సమాచారం బయటకొచ్చింది.
చేతిలో ఉన్న మూవీస్ షూటింగ్ చివరకు వచ్చేయడం, బేబీ బంప్‌తో కనిపించడం, ప్రెగ్నెన్సీ రూమర్స్ రావడంతో దీపిక పదుకొణె నుంచి త్వరలో గుడ్ న్యూస్ రాబోతుందనిపిస్తోంది. ఇకపోతే దీపిక.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ని 2018లో పెళ్లి చేసుకుంది.
(ఇదీ చదవండి: నెలకు రూ.35 లక్షలు వచ్చే పనిమానేశా: '12th ఫెయిల్' హీరో)
#deepikapadukone airport look in a stylish way ✈️♥️ pic.twitter.com/b0x66dBAa0
— Womansera (@WomansEra2) February 20, 2024
Comments
Please login to add a commentAdd a comment