
బాలీవుడ్ జంట ప్రిన్స్ నరౌలా- యువికా చౌదరి త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు. బిగ్‌బాస్ 9వ సీజన్‌లో ఫ్రెండ్స్ అయిన వీరు తర్వాత ప్రేమలో పడ్డారు.

బిగ్‌బాస్ హౌస్‌లో ప్రిన్స్ యువికాకు ప్రపోజ్ చేశాడు. అతడి ప్రేమకు ముగ్దురాలైన యువిక వెంటనే ఓకే చెప్పింది. ఈ లవ్ బర్డ్స్ 2018 జనవరిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.

2019లో నాచ్ బలియే అనే డ్యాన్స్ షోలో జంటగా పాల్గొని గెలిచారు. తాజాగా ఈ జంట త్వరలోనే పెరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించారు.

కాగా ప్రిన్స్ నరౌలా రియాలిటీ షోలలో తన టాలెంట్ చూపించేవాడు. 2015లో వచ్చిన రోడీస్ 2 సీజన్‌లో విజేతగా నిలిచిన ఇతడు స్ప్లిట్స్‌విల్లా 8వ సీజన్‌లోనూ పాల్గొని ట్రోఫీ గెలుచుకున్నాడు.

హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్‌లోనూ పార్టిసిపేట్ చేసి టైటిల్ అందుకున్నాడు. యువికా చౌదరి.. ఓం శాంతి ఓం, నాటీ @40, వీరే కీ వెడ్డింగ్, ఎస్‌పీ చౌహాన్, ద పవర్ వంటి చిత్రాల్లో నటించింది.











