
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు శుభవార్త చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన భర్త సిద్ధార్థ్‌తో కలిసి బేబీ సాక్స్‌ను చేతిలో పట్టుకున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘మా జీవితాల్లో గొప్ప బహుమతి.. త్వరలోనే రాబోతోంది’ అని వెల్లడించారు కియారా.
విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన ‘షేర్షా’(2021) సినిమాలో తొలిసారి కలిసి నటించారు సిద్ధార్థ్ – కియారా. ఆ మూవీ షూటింగ్‌లో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారడంతో 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు కాబోతున్న కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలకు సమంత, రాశీఖన్నా, అతియా శెట్టి వంటి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉంటే .. తెలుగులో మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్’ సినిమాల్లో నటించారు కియారా అద్వానీ.
Comments
Please login to add a commentAdd a comment