ప్రెగ్నెంట్‌.. అయినా డ్యాన్స్‌, దాండియా చేసిన స్టార్‌ హీరోయిన్‌ | Anant Ambani Pre Wedding Celebrations: Ranveer Singh Does Dandiya With Pregnant Deepika Padukone, Video Viral - Sakshi
Sakshi News home page

Anant Ambani Pre Wedding: భర్తతో డ్యాన్స్‌ చేసిన దీపిక.. వీడియో వైరల్‌

Published Sun, Mar 3 2024 1:28 PM | Last Updated on Sun, Mar 3 2024 3:10 PM

Anant Ambani Pre Wedding: Ranveer Singh Does Dandiya with Pregnant Deepika Padukone - Sakshi

'అందరూ పెళ్లి చేసుకుంటున్నారు.. పిల్లల్ని కంటున్నారు? మరి మీరెప్పుడు పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందుతారు?'.. ఈ ప్రశ్న వినీవినీ విసిగెత్తిపోయారు బావుడ్‌ స్టార్‌ జంట రణ్‌వీర్‌ సింగ్‌- దీపికా పదుకోణ్‌. దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2018లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే వీరు తల్లిదండ్రులం కాబోతున్నామంటూ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. సెప్టెంబర్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చారని వెల్లడించారు. 

స్టేజీపై డ్యాన్స్‌
ఈ విషయాన్ని పక్కన పెడితే అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఎంతో గ్రాండ్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ వేడుకలకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో రణ్‌వీర్‌-దీపికా కూడా ఉన్నారు. అందరూ ఆడిపాడుతుంటే చూస్తూ కూర్చోవాలా? అనుకున్నారో ఏమో కానీ.. ఇద్దరూ కలిసి స్టేజీపై ఓ పాటకు డ్యాన్స్‌‌ చేశారు. అక్కడితో ఊరుకోలేదు. స్టేజీ దిగాక ఇద్దరూ దాండియా ఆడుతూ ఎంజాయ్‌ చేశారు. ప్రెగ్నెంట్‌ అయినా కూడా దీపిక ఇలా డ్యాన్స్‌, దాండియా చేస్తుండటంతో ఫ్యాన్స్‌ ఆశ్యర్యపోతున్నారు. తన ముఖం కళతో వెలిగిపోతోందని కామెంట్స్‌ చేస్తున్నారు.

దీపిక భర్తను బెదిరించిన ఓరీ
మరోవైపు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ వాలిపోయే ఓరీ కూడా ఈ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యాడు. ఇంకేముంది.. దీపికాతో కలిసి ఫోటోకు పోజిచ్చాడు. ఈ ఫోటో తీయడానికి రణ్‌వీర్‌ అష్టకష్టాలు పడుతుంటే బాగా తీయమని బెదిరించాడు ఓరీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: మొగలిరేకులు ఫేమ్‌ దయ మృతికి కారణాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement