83 Movie Success: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 83 చిత్రం ఈరోజు (డిసెంబర్ 24) థియేటర్లలో విడుదలైంది. భారత్‌కు తొలి ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిన క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించాడు. కబీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1983లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ జైత్రయాత్ర నేపథ్యంగా తెరకెక్కింది. కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ చక్కగా ఒదిగిపోయాడు. హెయిర్ స్టైల్ గెటప్ నుంచి కపిల్ ఆట ఆడే విధానం వరకు డిట్టు దించేశాడు రణ్‌వీర్. 83 సినిమా రివ్యూలో రణ్‌వీర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు రణ్‌వీర్.
రణ్‌వీర్ తన పోస్ట్‌లో అమ్మ మేము గెలిచాం. అని పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో రణ్‌వీర్ తల్లి (అంజు భవ్నాని) 1983లోని అసలు ప్రపంచ కప్ పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. అయితే సినిమా చిత్రీకరణ కోసం అసలైన 1983 ప్రపంచ కప్‌ను (అప్పట్లో ప్రుడెన్షియల్ కప్ అని పిలిచేవారు) కబీర్ ఖాన్ తీసుకున్నాడట. 'మేము లండన్‌లో లార్డ్స్ స్టేడియంలో ఐదు రోజులు షూట్ చేశాం. ఇంతకు ముందు లేని కెమెరా లేని లాంగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్‌లు, లాకర్ల గదులోకి వెళ్లి చూశాం. కపిల్‌కు ప్రపంచ కప్ బహుకరించిన బాల్కనీలోకి వెళ్లాం. అక్కడ వారు రణ్‌వీర్ కోసం వరల్డ్ కప్‌ను తీసుకొచ్చి అందించారు.' అని కబీర్ ఖాన్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment