ఐపీఎల్ కొత్త జట్టు కోసం బాలీవుడ్‌ స్టార్‌ జంట ఆసక్తి, ఎవరో తెలుసా? | Ranveer Singh Deepika Padukone to Bid for New IPL Franchise | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ కొత్త జట్టు కోసం బాలీవుడ్‌ స్టార్‌ జంట ఆసక్తి, ఎవరో తెలుసా?

Oct 22 2021 1:44 PM | Updated on Oct 22 2021 3:57 PM

Ranveer Singh Deepika Padukone to Bid for New IPL Franchise - Sakshi

అదేవిధంగా  రెండు కొత్త ఐపీఎల్‌ జట్లలో అహ్మదాబాద్,  లక్నో ముందు వరుసలో ఉన్నాయని సమాచారం. కాగా గతంలో రాంచీ, లక్నో, అహ్మదాబాద్, గౌహతి,  కటక్‌ను బీసీసీ షార్ట్ లిస్ట్ చేసింది.

Ranveer Singh Deepika Padukone to Bid for New IPL Franchise: వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్‌లో కొత్తగా రెండు జట్లు రాబోతున్నాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్రాంచైజీలను విక్రయించేందుకు బీసీసీఐ టెండర్లకు ఆహ్వానించింది. ఆ గడువు ఈ నెల 20 తేదీతో ముగిసింది. ఈ క్రమంలో  అక్టోబర్ 25న కొత్త జట్లుకోసం  బిడ్డింగ్ ప్రక్రియ దుబాయ్‌లో జరగునుంది. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. ప్రముఖ బాలీవుడ్‌  స్టార్‌ జంట రణవీర్ సింగ్- దీపికా పదుకొనే కొత్త ఫ్రాంచైజీను దక్కించుకునేందకు పోటీ పడుతున్నట్లు సమాచారం. మరో వైపు కొత్త ఫ్రాంచైజీ కోసం ప్రముఖ  ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యూనైటెడ్ కూడా పోటీ పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పటికే  2008లో ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటినుంచి బాలీవుడ్‌ తారలు ప్రీతి జింటా, షారుఖ్ ఖాన్ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు యాజమానులుగా ఉన్నారు. కాగా దీపికా తండ్రి ప్రకాశ్ పదుకునే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన గతంలో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా నిలిచాడు. ఇక రణ్వీర్ సింగ్ ప్రస్తుతం ప్రముఖ బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏ కు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్నాడు. అదేవిధంగా  రెండు కొత్త ఐపీఎల్‌ జట్లలో అహ్మదాబాద్,  లక్నో ముందు వరుసలో ఉన్నాయని సమాచారం. కాగా గతంలో రాంచీ, లక్నో, అహ్మదాబాద్, గౌహతి,  కటక్‌ను బీసీసీ షార్ట్ లిస్ట్ చేసింది.

చదవండి: టీ20 ప్రపంచకప్ ఫేవరెట్ ఆ రెండు జట్లే: షేన్ వార్న్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement