new ipl team
-
ఐపీఎల్ కొత్త జట్టు కోసం బాలీవుడ్ స్టార్ జంట ఆసక్తి, ఎవరో తెలుసా?
Ranveer Singh Deepika Padukone to Bid for New IPL Franchise: వచ్చే ఏడాది జరుగనున్న ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లు రాబోతున్నాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్రాంచైజీలను విక్రయించేందుకు బీసీసీఐ టెండర్లకు ఆహ్వానించింది. ఆ గడువు ఈ నెల 20 తేదీతో ముగిసింది. ఈ క్రమంలో అక్టోబర్ 25న కొత్త జట్లుకోసం బిడ్డింగ్ ప్రక్రియ దుబాయ్‌లో జరగునుంది. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ జంట రణవీర్ సింగ్- దీపికా పదుకొనే కొత్త ఫ్రాంచైజీను దక్కించుకునేందకు పోటీ పడుతున్నట్లు సమాచారం. మరో వైపు కొత్త ఫ్రాంచైజీ కోసం ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యూనైటెడ్ కూడా పోటీ పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుంచి బాలీవుడ్ తారలు ప్రీతి జింటా, షారుఖ్ ఖాన్ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు యాజమానులుగా ఉన్నారు. కాగా దీపికా తండ్రి ప్రకాశ్ పదుకునే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఆయన గతంలో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా నిలిచాడు. ఇక రణ్వీర్ సింగ్ ప్రస్తుతం ప్రముఖ బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అదేవిధంగా రెండు కొత్త ఐపీఎల్ జట్లలో అహ్మదాబాద్, లక్నో ముందు వరుసలో ఉన్నాయని సమాచారం. కాగా గతంలో రాంచీ, లక్నో, అహ్మదాబాద్, గౌహతి, కటక్‌ను బీసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. చదవండి: టీ20 ప్రపంచకప్ ఫేవరెట్ ఆ రెండు జట్లే: షేన్ వార్న్ -
ఐపీఎల్ టీం... ఇప్పుడు మరింత కాస్ట్లీ గురు!
మోస్ట్ పాపులర్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పాలిట కామధేనువులా మారింది. పుష్కరకాలంగా కాసుల వర్షం కురిపిస్తోంది. రాబోయే 2022 సీజన్‌కి రెండు కొత్త జట్ల రాకతో బీసీసీఐ ఆదాయానికి అదనంగా రూ. 5000 కోట్లు వచ్చి చేరతాయని అంచనా. పెరగనున్న బేస్ ప్రైస్ ? ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎనిమిది జట్లు ఉన్నాయి. వచ్చే సీజన్‌కి ఈ సంఖ్యను పది జట్లకు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ రెండు జట్లు సొంతం చేసుకునేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి బిడ్లను స్వీకరించనుంది బీసీసీఐ. అయితే ఇంతకు ముందు కొత్తగా ఒక జట్టును సొంతం చేసుకోవాలంటే కనీస ధరగా రూ. 1700 కోట్లుగా నిర్ణయించింది. ‘అయితే ప్రస్తుతం బీసీసీఐ యాక్షన్ ప్లాన్‌లో మార్పులు చోటు చేసుకున్నాయని, ఒక్కో జట్టుకు బేస్ ప్రైస్‌గా రూ. 2000 కోట్లను నిర్ణయించబోతున్నట్టు’ పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీసీసీఐ ప్రతినిధి పీఐటీ వార్త సంస్థకు తెలియజేశారు. ఈ మార్పుతో బీసీసీఐకి కనీసం రూ.5000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. టర్నోవర్ రూ. 3000 కోట్లు దాటితేనే కొత్త జట్లను సొంతం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా అనేక కార్పొరేట్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే బీసీసీఐ నిబంధనలు వీరికి అడ్డుగా ఉన్నాయి.ఐపీఎల్ జట్టును సొంతం చేసుకోవాలనుకునే కంపెనీ వార్షిక టర్నోవరు కనీసం రూ.3000 కోట్లు దాటి ఉండాలని బీసీసీఐ పేర్కొంటోంది. ఐపీఎల్ బిడ్డింగ్ పత్రాలను రూ. 75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కన్సార్టియంలకు అవకాశం బ్రాండ్ ప్రచారానికి విపరీతమైన హైప్ తెచ్చిపెట్టే ఐపీఎల్ జట్టును కొనేందుకు ఎక్కువ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నా బేస్ ప్రైస్ ఎక్కువగా ఉండటం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు రెండు లేదా మూడు కంపెనీలు కలిసి కన్సార్టియంగా ఏర్పడి బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అయితే గరిష్టంగా మూడు కంపెనీలకే అవకాశం కల్పించాలని యోచిస్తోంది. కొత్తగా ఇక్కడేనా ? అహ్మదాబాద్, లక్నో, పుణే ఈ మూడింటిలో రెండింటికి కొత్తగా టీమ్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో పుణే, గుజరాత్ల పేరుతో గతంలో ఐపీఎల్ టీమ్‌లు కొనసాగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లో అందుబాటులోకి రావడంతో అహ్మదాబాద్‌కి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు సమాచారం. ఇక లక్నో ఎక్నా స్టేడియం కెపాసిటీ కూడా ఎక్కువే. అదాని, ఆర్పీజీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌లతో పాటు ప్రముఖ ఫార్మా, బ్యాంకింగ్ కంపెనీలు ఐపీఎల్ జట్టును సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. చదవండి : Zomato: యాడ్ల దుమారం, మండిపడుతున్న నెటిజనులు -
ఐపీఎల్-2?
♦ మరో లీగ్ ఆలోచనలో బీసీసీఐ ♦ విధివిధానాలపై కసరత్తు ప్రస్తుతం బీసీసీఐ ఆలోచనలు చూస్తే త్వరలో విజయవాడ విన్నర్స్ అనో వైజాగ్ హీరోస్ అనో కొత్త ఐపీఎల్ జట్టును చూడొచ్చు. చాంపియన్స్ లీగ్ రద్దు చేసే ఆలోచనలో ఉన్న బోర్డు ఆ స్థానంలో కొత్త లీగ్‌ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఉన్న ఐపీఎల్ జట్లతో ఓ మినీ టోర్నీ నిర్వహించడమా లేక కొత్త జట్లతో ఐపీఎల్-2 ప్రారంభించడమా అనే ప్రతిపాదనలతో చర్చలు జరుగుతున్నాయి. సాక్షి క్రీడావిభాగం : చాంపియన్స్ లీగ్ టి20 ద్వారా తమకు ఏ మాత్రం లాభాల్లేవంటూ ఆ లీగ్ ప్రసారకర్త చేతులెత్తేసింది. ఆరేళ్లుగా ప్రతి సెప్టెంబరు-అక్టోబరులో ఈ లీగ్ కోసం ఐసీసీ ఏకంగా ఓ విండో ఏర్పాటు చేసింది. ఈ సమయాన్ని ఉపయోగించుకుంటూ డబ్బు సంపాదించడంపై ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి పెట్టింది. క్రికెట్‌కు దేశంలో ఉన్న ఆదరణ, ఐపీఎల్‌కు పోటెత్తుతున్న అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఓ టి20 లీగ్‌ను నిర్వహించాలనే ప్రతిపాదనతో ఉంది. చాంపియన్స్ లీగ్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల ఉమ్మడి ఆస్తి. ఇందులో వచ్చిన లాభాలను అందరూ పంచుకుంటారు. అయితే ఐపీఎల్‌కు కొనసాగింపుగా మరో టోర్నీ తెస్తే పూర్తి లాభాలు భారత్‌కే దక్కుతాయి. ఈ నేపథ్యంలో బోర్డు పెద్దలు రెండు ప్రతిపాదనలను చర్చిస్తున్నారు. ప్రతిపాదన 1: 4 జట్లతో యూఏఈలో టోర్నీ గత ఏడాది ఎన్నికల కారణంగా యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించారు. అక్కడ అభిమానులు భారీగా స్టేడియాలకు వచ్చారు. దీంతో బీసీసీఐకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ ఏడాది చాంపియన్స్ లీగ్ బదులుగా మినీ ఐపీఎల్‌ను ఏర్పాటు చేసి దానిని యూఏఈలో నిర్వహించాలనే ఓ ప్రతిపాదన ఉంది. ఈ సీజన్ ఐపీఎల్లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లతో ఈ లీగ్ ఆడించాలని భావిస్తున్నారు. అయితే ఈ ఫార్మాట్లో ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడినా ఫైనల్‌తో కలిపి 13 మ్యాచ్‌లు మాత్రమే వస్తాయి. కాబట్టి టోర్నీ మరీ చిన్నగా అయిపోతుంది. ప్రసారకర్తలు దీనిని ఒప్పుకోకపోవచ్చు. ప్రతిపాదన 2: చిన్న నగరాల్లో కొత్త జట్లతో టోర్నీ ఈ సీజన్లో ఐపీఎల్ కౌన్సిల్ కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు సూపర్ హిట్ అయ్యాయి. చిన్న పట్టణాల్లోని మైదానాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్‌లు చూపించారు. గుంటూరులో 30 వేల మంది వచ్చారని కౌన్సిల్ ప్రకటించింది. ఈ ఆదరణ బీసీసీఐని ఉక్కిరిబిక్కిరి చేసింది. విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాలలో మ్యాచ్‌లను నిర్వహించినా అభిమానులు వస్తారనే నమ్మకం పెరిగింది. దీంతో చిన్న నగరాల నుంచి జట్లను తీసుకుని ఐపీఎల్-2ని కొత్త జట్లతో నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. అహ్మదాబాద్, విజయవాడ, భోపాల్ లాంటి నగరాలతో కొత్త జట్లను తయారు చేస్తారు. ఇందులో బాగా ఆడిన రెండు జట్లను ఐపీఎల్-1కు ప్రమోట్ చేయడం... అలాగే ఐపీఎల్-1లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లను తర్వాతి సీజన్లో ఐపీఎల్-2కి పంపడం వల్ల రెండు లీగ్‌లను హిట్ చేయొచ్చనేది ఆలోచన. ప్రతిపాదన-2 వల్ల కొంత సమస్య కూడా ఉంది. ఐపీఎల్-1 ద్వారా దాదాపు ప్రధాన క్రికెటర్లంతా బిజీగా ఉన్నారు. మరి ఐపీఎల్-2కి క్రికెటర్లు ఎలా? పేరు లేని క్రికెటర్లను రంజీ స్టార్స్‌ని తెచ్చి ఆడిస్తే ప్రేక్షకులు రారు. ప్రేక్షకులు లేకపోతే టీవీ ప్రసారకర్తలు ఆసక్తి చూపించరు. ఈ సమస్యను అధిగమించడం గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. 2017తో ఐపీఎల్ జట్ల కాంట్రాక్టులు ముగుస్తాయి. ఇప్పుడు ఉన్న 8 జట్లతోఒప్పందం పూర్తవుతుంది. మళ్లీ జట్ల కోసం బిడ్డింగ్‌కు వెళతారా? లేక ఇప్పుడున్న ఓనర్లకే కొనసాగింపు ఇస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ మళ్లీ బిడ్డింగ్‌కు వెళితే 16 నగరాల నుంచి 16 జట్లకు బిడ్డింగ్ కోరవచ్చు. అప్పుడు రెండు లీగ్‌లకు కలిపి ఆటగాళ్ల వేలం నిర్వహించొచ్చు. ఏమైనా ఇంకా ఈ టోర్నీలపై చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయి. ఒకట్రెండు నెలల్లో కొత్త లీగ్ గురించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.