

బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో దీపికా పదుకొణె- రణ్‌వీర్ సింగ్ జంట ఒకరు.

2013లో వచ్చిన గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా మూవీ ప్రేమలో పడ్డారు.

ఆ తర్వాత దాదాపు ఆరేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు.

2018లో నవంబర్ 14న వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.

ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కొంకణి, సింధీ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు.

ఇవాళ ఈ జంట తమ 6వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా తన భార్యకు విషెస్ చెప్పారు రణ్‌వీర్ సింగ్..

సోషల్ మీడియా వేదికగా దీపికా అరుదైన ఫోటోలను షేర్ చేశారు.

ఈ రోజు స్పెషల్ డే అంటూ ఐ లవ్ యూ చెబుతూ పోస్ట్ చేశాడు.

కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 8న ఈ జంటకు కూతురు జన్మించిన సంగతి తెలిసిందే.

దీపికా చివరిసారిగా ప్రభాస్ నటించిన కల్కి మూవీ కనిపించింది.








