Can You Guess This Star Hero? - Sakshi
Sakshi News home page

Star Hero: అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగిన ఈ హీరోను గుర్తుపట్టారా? అతడి భార్య ఒక స్టార్‌ హీరోయిన్‌..

Published Fri, Aug 11 2023 9:06 AM | Last Updated on Fri, Aug 11 2023 9:28 AM

Can You Guess the Star Hero - Sakshi

స్టైల్‌గా కళ్లజోడు, చేతిలో గన్‌ పట్టుకుని ఫైరింగ్‌ చేస్తున్నట్లు బిల్డప్‌ ఇస్తున్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? ఇతడు సినీ ఇండస్ట్రీలో టాప్‌ హీరో. ఈ మధ్యే రిలీజైన ఇతడి మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో అతడు హ్యాపీ మూడ్‌లో ఉన్నాడు. ఇటీవలి కాలంలో రూ.200 కోట్లు రాబట్టిన చిత్రం ఏంటా? అని చూస్తున్నారా? అది మన తెలుగులో కాదు, హిందీలో! జూలై 23న రిలీజైన రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ చిత్రం ఇప్పటివరకు రూ.200 కోట్లకుపైగా కలెక్షన్స్‌ సాధించింది. బాలీవుడ్‌ పనైపోయిందన్న రూమర్స్‌కు కలెక్షన్స్‌తో చెంపపెట్టు సమాధానమిచ్చిందీ చిత్రం. ఇందులో హీరోగా నటించిన రణ్‌వీర్‌ సింగ్‌ చిన్ననాటి ఫోటోయే పైన కనిపిస్తున్న చిత్రం!

యాక్టింగ్‌ అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం
రణ్‌వీర్‌కు చిన్నప్పటి నుంచే యాక్టింగ్‌ అంటే ఇష్టం. కానీ గ్లామర్‌ ప్రపంచంలో అడుగుపెట్టడం అంత సులువు కాదని అతడికి చిన్నవయసులోనే అర్థమైంది. మొదట అతడు వాణిజ్య ప్రకటనలకు రచయితగా పని చేశాడు. అలాగే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ వర్క్‌ చేశాడు. ఇలా వివిధ రకాల పనులు చేసుకుంటూ పోతే అవకాశాలు వచ్చేది ఎప్పటికో అని ఆలోచించిన రణ్‌వీర్‌.. ఈ పనులన్నీ మానేసి ఆడిషన్స్‌కు వెళ్లడం మొదలుపెట్టాడు. చెప్పులరిగేలా తిరుగుతున్నా ఒక్కటంటే ఒక్క మంచి ఛాన్స్‌ కూడా రాలేదు.

తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా అవార్డు
అసలు సరైన దారిలోనే వెళ్తున్నానా? అని అనుమానపడుతున్న సమయంలో బ్యాండ్‌ బాజా బారత్‌ సినిమా ఆడిషన్స్‌లో సెలక్ట్‌ అయ్యాడు. అది కూడా హీరోగా! అంతేకాదు, ఈ చిత్రానికిగానూ ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిలిం ఫేర్‌ అవార్డు సైతం అందుకున్నాడు, అక్కడి నుంచి హీరోగా తన ప్రస్థానం ముందుకు సాగింది. కొంత కాలానికే స్టార్‌ హీరో అయ్యాడు. హీరోయిన్‌ దీపికా పదుకొణెతో లవ్‌లో పడ్డ ఇతడు 2018లో ఆమెను పెళ్లాడాడు. వీరిద్దరూ బాలీవుడ్‌లో టాప్‌ పొజిషన్‌లో రాణిస్తూ స్టార్‌ జంటగా కీర్తి పొందుతున్నారు. ఇక రణ్‌వీర్‌.. స్టైలిష్‌ అవతార్‌లో కనిపిస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్‌ సెట్‌ చేస్తుంటాడు.

రణ్‌వీర్‌ సినిమాల విషయానికి వస్తే..
రణ్‌వీర్‌ సింగ్‌ డాన్‌ 3 సినిమాలో నటించనున్నాడు. గతంలో వచ్చిన ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌’, ‘డాన్‌ 2: ది కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’ సినిమాల్లో షారుక్‌ ఖాన్‌ నటించగా ఈ సీక్వెల్‌లో మాత్రం రణ్‌వీర్‌ ఎంట్రీ ఇచ్చాడు. గత రెండు సినిమాలను డైరెక్ట్‌ చేసిన ఫర్హాన్‌ అక్తర్‌ ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నిద్ర పోతున్న సింహం లేచిందని ప్రపంచానికి తెలియాలి, వెళ్లి చెప్పు.. నేను తిరిగొస్తున్నానని’, ‘నేనే డాన్‌ని’ అనే  డైలాగ్స్‌ ‘డాన్‌ 3’ అనౌన్స్‌మెంట్‌ వీడియోలో వినిపిస్తాయి. ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది చివరికల్లా ప్రారంభించి 2025లో రిలీజ్‌ చేయనున్నారు.

చదవండి: చాలామంది హేళనగా చూశారు: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement