
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైభీమ్' ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం. ఇదిలా ఉంటే జూన్ నెలలో ప్రారంభం కానున్న రజనీ 171వ చిత్రానికి సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కారణం ఈ చిత్రానికి లోకేష్‌కనకరాజ్ దర్శకత్వం వహించడమే!
సపోర్టింగ్ రోల్స్..
రజనీకాంత్ ఇటీవల కాలంలో తన చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల కోసం ఇతర భాషలకు చెందిన స్టార్ నటులను వాడుకుంటున్నారు. జైలర్ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్‌లు అతిథి పాత్రల్లో నటించారు. అలాగే తాజాగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
షారుక్ 'నో'.. రణ్‌వీర్ 'ఓకే'
త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న రజనీకాంత్ 171 చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ముందుగా షారుక్ ఖాన్‌ను నటింపజేయడానికి లోకేష్ కనకరాజ్ ప్రయత్నించగా, ఆయన నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రానికి కళుగు (తెలుగులో గద్ద) అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్‌తో కలిసి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్ నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తాజా సమాచారం. అయితే ఆయన ఇందులో సపోర్టింగ్ పాత్రను పోషిస్తారా?లేక ప్రతినాయకుడిగా నటిస్తారా? అన్నది సస్పెన్స్!
చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది?
Comments
Please login to add a commentAdd a comment