Deepika Padukone Birthday Wishes To Husband Ranveer Singh, Shares Post After Two Days - Sakshi
Sakshi News home page

Deepika Padukone: రణ్‌వీర్‌ సింగ్ బర్త్ డే.. ఆలస్యంగా దీపికా విషెస్!

Published Sat, Jul 8 2023 2:24 PM | Last Updated on Sat, Jul 8 2023 2:56 PM

Deepika Padukone Wish husband Ranveer Singh birthday post after Two days - Sakshi

బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ జంట ఒకరు. గోలియోన్ కి రాస్లీలా: రామ్ లీలా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట ఆరేళ్ల పాటు డేటింగ్‌ ఉన్నారు. ఆ తర్వాత 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే చాలాసార్లు ఈ జంట విడిపోతున్నట్లు రూమర్స్ బీ టౌన్‌లో వినిపించాయి. కానీ వాటిని ఈ జంట కొట్టిపారేసింది.  తామిద్దరం బాగానే ఉన్నట్లు పలుసార్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. 

(ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్‌ వస్తుంది: మాళవిక)

ఇటీవలే జూలై 6న రణ్‌వీర్‌ సింగ్‌ బర్త్‌డే సందర్భంగా దీపికా విష్ చేయలేదు. అయితే బర్త్‌ డే అయిపోయిన రెండు రోజులకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో తన భర్తపై ప్రశంసలు కురిపించింది. పురుషుల ఫ్యాషన్‌కు బ్రాండ్‌గా నిలిచారంటూ భర్తను పొగిడింది . ఆ ఫోటోలు రణ్‌వీర్ సింగ్ డిఫరెంట్‌ డ్రెస్‌లో కనిపించారు. అంతే కాకుండా "హెల్ యా" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా.. దీపికా పదుకొణే ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్-కె చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో ఫైటర్‌లో నటించనుంది. రణ్‌వీర్‌ సింగ్ ప్రస్తుతం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రంలో కనిపించనున్నారు.

(ఇది చదవండి: దీపికా- రణ్‌వీర్‌కు అసలేమైంది.. మరోసారి తెరపైకి రూమర్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement