Janhvi Kapoor Comments On Ranveer Singh Shirtless Picture Photoshoot - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: దుస్తులు లేకుండా రణ్‌వీర్‌.. ‍అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ

Jul 30 2022 4:23 PM | Updated on Jul 30 2022 6:11 PM

Janhvi Kapoor Comments On Ranveer Singh Nude Photoshoot - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటో షూట్‌ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు సంచలనంగా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Janhvi Kapoor Comments On Ranveer Singh Nude Photoshoot: బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటో షూట్‌ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు సంచలనంగా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌పై ముంబైలోని చెంబూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు.  అంతకుముందు.. రణ్‌వీర్‌కు చాలా మంది సెలబ్రిటీలు మద్దుతు ఇస్తుండటంతో.. అదే ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్‌ చేస్తే ప్రశంసిస్తారా అని టీఎమ్‌సీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ప్రశ్నించారు.

అయితే తాజాగా ఈ ఫొటోషూట్‌పై బాలీవుడ్‌ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ స్పందించింది. ఢిల్లీలోని రిలయన్స్‌ డిజిటల్‌ షోరూమ్‌ను తాజాగా ప్రారంభించిన జాన్వీని పలువురు విలేకర్లు రణ్‌వీర్‌ సింగ్ న్యూడ్‌ ఫొటోషూట్‌పై తన అభిప్రాయం అడిగారు. దీనికి స్పందించిన జాన్వీ.. 'అది ఒక కళాత్మక స్వేచ్ఛ అని నేను భావిస్తున్నాను. అలాంటి దానికోసం ఎవరినైనా విమర్శించడం, విశ్లేషించడం సరైన పద్ధతి కాదని అనుకుంటున్నాను' అని తెలిపింది. కాగా 1972లో కాస్మొపాలిటన్‌ మ్యాగజైన్ కోసం పాప్‌ ఐకాన్‌ బర్ట్‌ రెనాల్డ్స్‌కు నివాళిగా రణ్‌వీర్ సింగ్ ఫొటోషూట్‌ చేసిన విషయం తెలిసిందే. 
 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement