Ranveer Singh Buys Costly Quadruplex In Bandra, Deets Inside - Sakshi
Sakshi News home page

Ranveer Singh: షారుక్‌ ఖాన్‌ పొరుగింట్లోకి స్టార్‌ సెలబ్రిటీ జంట

Published Mon, Jul 11 2022 1:31 PM | Last Updated on Mon, Jul 11 2022 4:06 PM

Ranveer Singh Buys Costly Quadruplex In Bandra, Deets Inside - Sakshi

స్టార్‌ సెలబ్రిటీ జంట రణ్‌వీర్‌ సింగ్‌- దీపిక పదుకొణె కొత్త ఫ్లాట్‌ కొంది. ముంబైలో సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే బాంద్రాలో క్వాడ్రూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశాడు రణ్‌వీర్‌. దీని విలువ రమారమి రూ.118.94 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ క్వాడ్రూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌.. 16, 17, 18, 19 అంతస్థుల్లో విస్తరించి ఉంది. మొత్తంగా ఇది 11,266 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్టాంప్‌ డ్యూటీలో భాగంగా రణ్‌వీర్‌ రూ.7.13 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ రిజిస్ట్రేషన్‌తో రణ్‌వీర్‌.. షారుక్‌ ఖాన్‌ ఇంటికి సమీపంలోనే పాగా వేయనున్నాడన్నమాట.

ఈ విషయం గురించి ఓ రియల్టర్‌ మాట్లాడుతూ.. 'సాగర్‌ రేషం భవనాన్ని రినొవేట్‌ చేస్తున్నాం. ఈ భవంతిలోని కింది ఫ్లోర్లను పాతవారికే అప్పజెపుతాం. ఇకపోతే 16వ అంతస్థు.. 4 బెడ్‌రూమ్‌లు ఉన్న ఫ్లాట్‌ కాగా 17, 18, 19 అంతస్థులు పెంట్‌హౌస్‌గా ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు. కాగా రణ్‌వీర్‌ చేతిలో ప్రస్తుతం రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని, సర్కస్‌ సినిమాలు ఉన్నాయి.

చదవండి: మలయాళ దర్శకుడు కన్నుమూత
లక్కీ చాన్స్‌ చేజార్చుకున్న కీర్తి సురేశ్‌? ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement