బాలీవుడ్‌లో వరుస విజయాలతో ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ దూసుకుపోతున్నారు. ఈ ఏడాదిలో విడుదలైన తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా, ముంజ్యా, స్త్రీ 2 చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇదే ఊపుతో ఆయన తదుపరి బిగ్ ప్రాజెక్ట్‌లపైన కసరత్తు ప్రారంభించారు. దినేష్ విజన్ నిర్మాణ భాగస్వామ్యంతో 'స్కై ఫోర్స్, ఛావా' వంటి భారీ చిత్రాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న 'ఛావా' సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న థియేటర్‌లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. మరోవైపు అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్, వీర్, నిమ్రత్ కౌర్ నటించిన 'స్కై ఫోర్స్' 2025లో విడుదల కానుంది. రిపబ్లిక్ డే కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనున్నారు. యాక్షన్, డ్రామా, భావోద్వేగాలతో పాటు థ్రిల్స్, బలమైన దేశభక్తి థీమ్‌తో నిండి ఉందని చిత్ర నిర్మాతలు దినేష్ విజన్, అమర్ కౌశిక్ టీమ్ పేర్కొంది. పాకిస్థాన్‌పై భారతదేశం జరిపిన మొదటి వైమానిక దాడి నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ మూవీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేస్తుందని వారు పేర్కొన్నారు.
'స్కై ఫోర్స్' సినిమాలో VFX వర్క్ బాగా వర్కౌట్ అయింది. జాతీయ, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న DNEG సంస్ధ వారు ఈ సినిమా VFX కోసం పనిచేశారు. ఈ చిత్రంలో ఉత్కంఠభరితమైన వైమానిక దృశ్యాలు అందరినీ మెప్పిస్తాయి. అక్షయ్ కుమార్, వీర్ మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ స్టాండ్ అవుట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. బాలీవుడ్‌లో ఎన్నటికి నిలిచిపోయేలా స్కై ఫోర్స్ చిత్రం ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment