![Akshay Kumar Tests Coronavirus Positive, Skip Anant Ambani Radhika Merchant Wedding](/styles/webp/s3/article_images/2024/07/12/anant-ambani-akshay.jpg.webp?itok=CIIX7yQ9)
అంబానీ ఇంట ఫంక్షన్ అంటే అందరు సెలబ్రిటీలు ఉండాల్సిందే! ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకలకు సినీతారలు హాజరై ఆ సెలబ్రేషన్స్‌ను రెండింతలు చేశారు. అత్యంత ముఖ్య ఘట్టమైన పెళ్లి కోసం ఎక్కడెక్కడో ఉన్న తారలంతా ముంబై పయనమయ్యారు. రామ్‌చరణ్, మహేశ్‌బాబుతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ అంతా వివాహ వేడుకల్లో తళుక్కుమని మెరవనున్నారు.
హీరోకు అస్వస్థత!
ఈ లిస్టులో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. కానీ ఇంతలోనే ఆయన తన ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. కారణం.. కొద్దిగా అస్వస్థతకు లోనైన అక్షయ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అటు అంబానీ పెళ్లికి, ఇటు తన సినిమా సర్ఫిరా (ఆకాశమే నీ హద్దురా హిందీ రీమేక్) ప్రమోషన్స్‌కు డుమ్మా కొట్టనున్నాడని గాసిప్.
ఇప్పటికే రెండుసార్లు
అక్షయ్ గతంలో రెండుసార్లు కరోనా బారిన పడ్డాడు. 2021లో ఓసారి, 2022లో మరోసారి కోవిడ్‌తో పోరాడాడు. ఆ మహమ్మారిపై విజయం సాధించినప్పటికీ కోవిడ్ లక్షణాలు మాత్రం తనను వెంటాడుతున్నాయని గతంలో వెల్లడించాడు. మునుపటిలా ధృడంగా ఉండలేకపోతున్నానని పేర్కొన్నాడు.
చదవండి: 'భారతీయుడు 2' ఆ ఓటీటీలోనే.. ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Comments
Please login to add a commentAdd a comment