బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తనను నలుగురిలో చులకన చేసి మాట్లాడాడంటూ ఆరోపణలు గుప్పించింది సీనియర్ హీరోయిన్ శాంతిప్రియ. అక్షయ్- శాంతిప్రియ జంటగా ఇక్కె పె ఇక్కా అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అక్షయ్ తనను బాడీ షేమింగ్ చేశాడని, కానీ దక్షిణాదిన మాత్రం తనకు ఇటువంటి పరిస్థితులే ఎదురవ్వలేదని వెల్లడించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శాంతి ప్రియ మాట్లాడుతూ.. 'అక్షయ్‌తో నేను ఇక్కె పె ఇక్కా సినిమా చేశాను. ఒక మిల్లులో ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరిగింది. ఈ చిత్రంలో నాది గ్లామర్ రోల్ కాబట్టి కురచ దుస్తులు వేసుకున్నాను. అప్పుడు నా మోకాలు కాస్త కనిపిస్తోంది. అక్షయ్ అది చూసి శాంతి, నీ మోకాలికేమైంది? అన్నాడు. నేను ఏదైనా దెబ్బ తగిలిందేమో అని చూసుకునేసరికి అంత నల్లగా ఉన్నాయేంటి? అన్నాడు. అక్కడున్న అందరూ పగలబడి నవ్వారు. జోక్ చేయడం తప్పు కాదు, కానీ అందరిముందు జోక్ చేస్తే దాన్ని ఎగతాళి అంటారు. నలుగురిలో ఏది పడితే అది వాగకూడదు కదా!
సౌత్ ఇండస్ట్రీలో మాత్రం దర్శకనిర్మాతలు బొద్దుగా ఉన్న హీరోయిన్సే కావాలనేవాళ్లు. 90వ దశకంలో బాడీ షేమింగ్ అనేదానికి చోటే లేదు. సౌత్ వాళ్లు బొద్దుగా ఉండేవాళ్లే కావాలనేవారు. ఒకవేళ స్లిమ్‌గా ఉన్న హీరోయిన్స్ కావాలనుకుంటే ముంబైకి వచ్చేవారు. సౌత్‌లో నేను కొన్ని సినిమాలే చేశాను, కానీ నా సోదరి భానుప్రియ మాత్రం చాలా చిత్రాలు చేసింది' అని చెప్పుకొచ్చింది శాంతిప్రియ.
చదవండి: గ్లామర్‌తో మతి పోగొడుతున్న బ్యూటీ.. హనీరోజ్ కొత్త సినిమా పోస్టర్ చూశారా?
సితార తొలి పారితోషికంతో ఏం చేసిందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment