సూర్య హీరోగా నటించిన సూరరై పోట్రు (ఆకాశమే నీ హద్దురా) మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. కెప్టెన్ గోపినాథ్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీన్ని హిందీలో సర్ఫిరా పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ మూవీని డైరెక్ట్ చేసింది.
దారుణమైన వసూళ్లు
జూలై 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు దారుణమైన వసూళ్లు రాబట్టింది. కేవలం రూ.2.40 కోట్లు మాత్రమే సంపాదించింది. ఓవైపు కమల్ హాసన్ 'భారతీయుడు 2', మరోవైపు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' నుంచి గట్టి పోటీ ఉండటంతో సర్ఫిరాకు పెద్ద దెబ్బే పడింది. ఇటీవల వచ్చిన అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా సినిమా.. సర్ఫిరా కంటే ఎక్కువే రాబట్టింది. తొలి రోజు రూ.16 కోట్లు వసూలు చేసింది. పూర్తి రన్ టైమ్‌లో దాదాపు రూ.60 కోట్లు తెచ్చిపెట్టింది. అయినా కూడా దాన్ని ఫ్లాప్‌గా నిర్ధారించారు.
తక్కువ ఓపెనింగ్స్
గత 15 ఏళ్లలో అక్షయ్ కుమార్ సినీలైఫ్‌లో అత్యంత తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా సర్ఫిరా నిలిచింది. 2009లో '8 x 10 తస్వీర్' కేవలం రూ.1.8 కోట్లు వసూలు చేసింది. మిషన్ రాణిగంజ్ రూ.2.8 కోట్లు, సెల్ఫీ రూ.2.5 కోట్లు, బెల్‌బాటమ్ రూ.2.7 కోట్ల ఓపెనింగ్‌తో సరిపెట్టుకున్నాయి.
అప్పుడు వరుస హిట్లు
భారీ తారాగణం, అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన బచ్చన్ పాండే, రామ సేతు రూ.15 కోట్లలోపే ఓపెనింగ్స్ రాబట్టడం గమనార్హం. 2019లో మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూస్ సినిమాలతో వరుసగా మూడుసార్లు రూ.200 కోట్ల క్లబ్బులో చేరిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. త్వరలోనే అతడు మళ్లీ హిట్స్ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
చదవండి: బరాత్‌లో దుమ్ము లేపిన బ్యూటీలు.. అతడిని నెట్టేసి మరీ..!
Comments
Please login to add a commentAdd a comment