సెట్‌లో పని చేసే బాయ్స్ నుంచి హీరోలదాకా అందరూ సినిమా కోసం ఎంతగానో కష్టపడతారు. ప్రేక్షకులు ఆనందించేలా ఉండాలని తహతహలాడతారు. కానీ అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేవు. కొన్నిమాత్రమే సినీప్రియుల మెప్పు పొందుతాయి. అలా ఇటీవలి కాలంలో మూవీ లవర్స్‌ను ఆకట్టుకోలేకపోతున్నాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. వందల కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టే ఈ హీరో ఈ మధ్య కాలంలో హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు.
వరుస వైఫల్యాలు
ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన బడే మియా చోటే మియా, లేటెస్ట్ రిలీజ్ సర్ఫిరా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. వరుస అపజయాలతో అక్షయ్ ఒకింత నిరాశకు లోనయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ప్రతి సినిమా వెనక ఎంతో కష్టం దాగి ఉంటుంది. అలాంటిది ఏదైనా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిందంటే ఎవరికైనా మనసు ముక్కలవుతుంది.
ఫెయిల్యూర్స్‌తో బాధ
కానీ ఈ ఫెయిల్యూర్స్ గుణపాఠాలు నేర్పుతాయి. సక్సెస్ ఎంత అవసరమనేది గుర్తుచేస్తాయి. విజయాన్ని అందుకోవాలనే ఆకలిని పెంచుతాయి. అదృష్టవశాత్తూ కెరీర్ ప్రారంభంలోనే జయాపజయాలను ఎలా డీల్ చేయాలనేది నేర్చుకున్నాను. అయినప్పటికీ ఫెయిల్యూర్స్ మనసుకు కొంత బాధను, మనపై కొంత ప్రభావాన్ని కలుగజేస్తాయి.
అయినా తగ్గను
అయినా మనం సినిమా తలరాతను మార్చలేం. దాని ఫలితాలు మన చేతిలో ఉండవు. కేవలం సినిమా కోసం ఎంత కష్టపడతాం, ఎంత అద్భుతంగా మలుస్తామనేది మాత్రమే మన నియంత్రణలో ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. సర్ఫిరా విషయానికి వస్తే.. సూరరై పోట్రు (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) అనే తమిళ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.21 కోట్లు రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment