కొత్త ఏడాదిలో బాలీవుడ్ నుంచి చాలా సినిమాలు లైన్‌లో ఉన్నాయి. 2023లో పఠాన్, జవాన్, గదర్ 2, యానిమల్ చిత్రాలు మాత్రమే మెప్పించాయి. గతేడాదిలో బాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు సందడి చేయలేదు. గతేడాది చివర్లో సలార్, యానిమల్ చిత్రాలే అక్కడ ఎక్కువగా మెప్పించాయి. 2024లో కూడా బాలీవుడ్ నుంచి పెద్దగా చిత్రాలు లేవని చెప్పవచ్చు. దీంతో ఇతర భాషా చిత్రాలకు అక్కడ మరింత గుర్తింపు తెచ్చుకుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కొత్త సంవత్సరంలో అజయ్ దేవగన్ 'సింగమ్ ఎగైన్', హృతిక్ రోషన్ 'ఫైటర్' అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ నుంచి 'బడే మియాన్ చోటే మియాన్ ', 'జిగ్రా' టైటిల్‌తో అలియా భట్ వస్తుండగా.. 'వెల్‌కమ్ టు ది జంగిల్' చిత్రంతో మరోసారి అక్షయ్ కుమార్ 2024లో పలకరించనున్నారు. కొత్త ఏడాదిలో అక్షయ్, యాదృచ్ఛికంగా, తనకు ఇష్టమైన యాక్షన్- కామెడీ జానర్‌కి తిరిగి రావడం విశేషం. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్- ఇండియా చిత్రం ‘కల్కి 2898 AD’ కూడా బాలీవుడ్‌లో ఈసారి మరింత జోష్ నింపడం దాదాపు ఖాయం. ఇందులో ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ ఉన్నారు.
2024లో టబు, కరీన్ కపూర్, కృతి సనన్‌ల ‘ది క్రూ’ చిత్రంతో పాటు కాజోల్ నటించిన ‘దో పట్టి’ మూవీపై కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ఏడాది బాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియంటేడ్ చిత్రాలు కూడా కనిపిస్తాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు దేశం మొత్తం ఓటు వేయడానికి రెడీగా ఉంది. ఇలాంటి సమయంలో పంకజ్ త్రిపాఠి నటించిన దివంగత ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయి బయోపిక్ (Main Atal Hoon) విడుదల చేయేనున్నారు. రాజకీయ డ్రామాగా ఈ చిత్రం రానుంది. మరొక చిత్రం కంగనా రనౌత్ నిర్మిస్తున్న 'ది ఎమర్జెన్సీ' కూడా ఇదే ఏడాదిలో రానుంది. ఇందిరా గాంధీ పాత్రను కంగనా పోషిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment