Actress Shanti Priya Went Into Depression Over Akshay Kumar Body Shaming Comments - Sakshi
Sakshi News home page

Actress Shanti Priya: తెగ బాధపడుతున్న భానుప్రియ చెల్లి.. ఏం జరిగింది?

Published Mon, Aug 21 2023 10:56 AM | Last Updated on Mon, Aug 21 2023 11:12 AM

Actress Shanti Priya Depression Akshay Kumar Issue - Sakshi

హీరోయిన్ భానుప్రియ గుర్తుందా? కచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఈమె చెల్లెలు శాంతిప్రియ కూడా తెలుగులో  హీరోయిన్‌గా చేసింది. కాకపోతే తమిళ, హిందీలో వచ్చినన్ని ఛాన్సులు ఇక్కడ రాలేదు. అయితే కొన్నాళ్ల ముందు ఓ ఇంటర్వ‍్యూలో మాట్లాడిన ఈమె.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనని గతంలో అతడు బాడీ షేమింగ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరిన్ని విషయాలు బయటపెట్టింది. 

ఏం జరిగింది?
అక్షయ్-శాంతిప్రియ కలిసి 'ఇక్కె పె ఇక్కా' సినిమా చేశారు. ఓ మిల్లులో షూటింగ్. గ్లామర్ రోల్ కావడం వల్ల హీరోయిన్ శాంతిప్రియ కాస్త పొట్టిబట్టలు వేసుకుని ఉంది. దీంతో ఆమె మోకాలు కనిపించింది. అయితే అది చూసిన అక్షయ్.. ఏమైంది? మోకాలికి దెబ్బ తగిలాందా అని అన్నాడు. అంత నల్లగా ఉన్నాయేంటి అని కూడా కామెంట్ చేశాడు. దీంతో సెట్‌లోని ఉన్నవాళ్లందరూ శాంతిప్రియని చూసి నవ్వారు.

(ఇదీ చదవండి: అనసూయ బాధని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి!)

డిప్రెషన్‌తో బాధపడ్డా
'నాకు అప్పుడు 22-23 ఏళ్లు ఉంటాయి. అక్షయ్ చేసిన బాడీ  షేమింగ్ కామెంట్స్ వల్ల నేను డిప్రెషన్‌కి గురయ్యాను. ఆ సమయంలో అమ్మ నాకు అండగా నిలబడింది. నేను మాత్రమే కాదు అక్క భానుప్రియ కూడా ఇలాంటివి ఫేస్ చేసింది. నార్త్‪‌లోని కొన్ని మ్యాగజైన్స్ అయితే.. ముఖంపై మొటిమలు(పింపుల్స్) సంఖ్య బట్టి భానుప్రియ, తన సినిమాలకు పారితోషికం తీసుకుంటోందని రాసుకొచ్చారు'

సారీ చెప్పలేదు
తన స్కిన్ కలర్‌పై అప్పట్లో కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్.. ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని శాంతిప్రియ పేర్కొంది. ఓసారి ఈ విషయమై మాట్లాడుతూ.. జోక్ చేశానని అన్నాడు తప్పితే సీరియస్‌గా సారీ లాంటిదైతే అస్సలు చెప్పలేదని ఈమె తెలిపింది. ఇదిలా ఉండగా 1994 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శాంతిప్రియ.. 2014లో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement