‘కంచె, ఆచారి అమెరికా యాత్ర, అఖండ’ వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఖుషీగా ఉన్నారు. ఆమె ఆనందానికి కారణం అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలో చాన్స్ రావడమే. పదేళ్ల క్రితం చేజారిన అవకాశం ఇప్పుడు రావడంతో ప్రగ్యా తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ– ‘‘అక్షయ్ కుమార్ హీరోగా దర్శకుడు క్రిష్ ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమా తీశారు. ఆ మూవీ కోసం 2014లో ఆడిష¯Œ ఇచ్చాను. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం నాకు రాలేదు. అప్పుడు నిరుత్సాహపడ్డాను. అయితే పదేళ్ల తర్వాత ఇప్పుడు అక్షయ్‌గారి ‘ఖేల్ ఖేల్ మే’లో నటించే చాన్స్ రావడం హ్యాపీ. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. ముదాస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాప్సీ, వాణీ కపూర్ నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే... హిందీలో ‘టిటూ ఎమ్‌బీఏ’ (2014) చిత్రంలో హీరోయిన్‌గా నటించారు ప్రగ్యా. బాలీవుడ్‌లో ఆమెకు అది తొలి చిత్రం. పదేళ్లకు ప్రగ్యా మళ్లీ హిందీలో అవకాశం తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment