ఒకప్పుడు అద్దె ఇంట్లో.. ఆ జ్ఞాపకాలు తెంచుకోలేక.. | Akshay Kumar Plans To Buy His Childhood House, Once He Used To Rent | Sakshi
Sakshi News home page

Akshay Kumar: ఒకప్పుడు రూ.500 అద్దె.. ఇప్పుడదే ఇల్లు కోరుకుంటున్న హీరో

Published Mon, Apr 8 2024 1:33 PM | Last Updated on Mon, Apr 8 2024 2:52 PM

Akshay Kumar Plans To Buy His Childhood House, Once He Used To Rent - Sakshi

కష్టాలనే విజయానికి మెట్లుగా మెలుచుకుని ఎదిగిన హీరోలు ఎందరో! చీవాట్లు తిన్నచోటే చప్పట్లు కొట్టించుకుని, చులకనగా చూసిన కళ్లతోనే ఆరాధించేలా చూసుకుని, ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నవాళ్లనే తన ఇంటి ముందుకు రప్పించుకున్నవాళ్లు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. వారిలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఒకరు. ప్రస్తుతం ఇతడు 'బడే మియా చోటే మియా' సినిమాతో ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒకప్పుడు తాను అద్దెకు ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

రూ.500 అద్దె కట్టేవాళ్లం
అక్షయ్‌ మాట్లాడుతూ.. 'నా బాల్యంలో నివసించిన ఇంటికి వెళ్తుంటే నా మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. దీని వెనక సైకాలజీ ఏంటో నాకు తెలీదు గానీ ఆ పాతింటికి వెళ్లడం నాకెంతో ఇష్టం. మేము ఆ ఇంట్లో ఉండేందుకు రూ.500 అద్దె చెల్లించేవాళ్లం. ఇప్పుడా బిల్డింగ్‌ను రెనోవేట్‌‌ చేస్తున్నారని తెలిసి ఆ భవంతిలోని మూడో అంతస్థును నేను కొనాలనుకుంటున్నట్లు చెప్పాను. ఆ ఇంటితో మాకు విడదీయరాని అనుబంధం ఉంది.

ఆ ఎదురుచూపులు..
నాన్న ఉద్యోగానికి వెళ్తే.. నేను, చెల్లి.. ఆయన ఎప్పుడు వస్తాడా? అని గుమ్మం దగ్గర ఎదురుచూసేవాళ్లం. ఆ విజువల్స్‌ ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇంటి ముందు జామ చెట్టు ఉండేది. చెట్టెక్కి వాటిని తెంపుకుని తినేవాళ్లం. ఇప్పటికీ ప్రతి నెలా అక్కడికి వెళ్లినప్పుడల్లా జామకాయలు తెంపుతూ ఉంటాను. అక్కడి నుంచే వచ్చాను. కాబట్టి ఆ ఇంటితో బంధాన్ని అలాగే కొనసాగించాలనుకుంటున్నాను' అని అక్షయ్‌ కుమార్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: గ్రాండ్‌గా బుల్లితెర నటి సీమంతం.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement