స్టార్‌ హీరో అన్నదానం.. ప్లేటులో వడ్డించి మరీ.. | Akshay Kumar Wins Hearts As He Feeding People On Streets In His Mumbai Home, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Akshay Kumar: అన్నదానం చేసిన స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Published Wed, Aug 7 2024 2:37 PM | Last Updated on Wed, Aug 7 2024 3:33 PM

Akshay Kumar Feeding People on Streets, Watch Video

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. ఒకరి కడుపు నింపితే వచ్చే ఆనందం వెలకట్టలేనిది. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ముంబైలోని తన ఇంటి ఆవరణలో అన్నదానం చేసి మంచి మనసు చాటుకున్నాడు. ముఖానికి మాస్కు ధరించిన ఆయన పలువురికీ ప్లేటులో భోజనం వడ్డించి ఇచ్చాడు.

మా మనసులు గెలుచుకున్నావ్‌
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అక్షయ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అక్కి అన్న.. నువ్వు మా మనసులు గెలుచుకున్నావ్‌, నీది ఎంత మంచి మనసో అని కామెంట్లు చేస్తున్నారు.

రెండు ఫ్లాప్స్‌
కాగా అక్షయ్‌ కుమార్‌కు కరోనా సోకగా ఇటీవలే దాని నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో నటించిన ఖేల్‌ ఖేల్‌ మే సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఇందులో వాణి కపూర్‌, తాప్సీ, అమ్మీ విర్క్‌, ఫర్దీన్‌ ఖాన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ ఏడాది అక్షయ్‌.. బడే మియా చోటే మియా, సర్ఫిరా చిత్రాలతో అలరించాడు. అయితే ఈ రెండూ ఫ్లాప్‌ కావడంతో ప్రస్తుతం అతడు ఖేల్‌ ఖేల్‌ మే సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement