ప్రతి నటుడి కెరీర్‌లో హిట్టు, ఫ్లాప్ రెండూ ఉంటాయి. సక్సెస్ సాధించినప్పుడు పొగిడేవారికన్నా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు విమర్శించేవారే ఎక్కువమంది ఉంటారు. అలా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వరుస బాక్సాఫీస్ వైఫలయ్యాలతో బాధపడుతున్నప్పుడు ఓ నిర్మాత చులకనగా చూశాడట!
ఆ మూవీతో హిట్ ట్రాక్
1997లో అక్షయ్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కూడా తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. 1999లో జాన్వార్ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆనాటి సంగతులను జాన్వార్ డైరెక్టర్ సునీల్ దర్శన్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 'అక్షయ్ సినిమాలు వరుసగా ఫెయిలవుతున్న సమయంలో జాన్వార్ తెరకెక్కించాం.
సంపాదించిదంతా ధారపోశా..
ఈ సినిమా షూటింగ్ దాదాపు 110 రోజుల్లో పూర్తి చేశాం. ఇందులో అక్షయ్ కళ్లతోనే ఎమోషన్స్ పలికించాడు. సినిమా కొనేందుకు ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదు. దీంతో నేను సంపాదించిదంతా ఈ చిత్రం కోసమే ధారపోశాను. సినిమా టైటిల్, కథ, సంగీతం అన్నీ సరిగ్గా కుదరడంతో ప్రమోషన్స్ కూడా బాగానే చేశాం. అయితే మా సినిమా కంటే ముందు అక్షయ్ నటించిన మూవీ ఒకటి రిలీజ్ కావాల్సి ఉంది. ఎక్కడా బ్యానర్లు వేయలేదు. ఎందుకని అక్షయ్ నిర్మాతను అడగ్గా.. నీ కోసం బిల్‌బోర్డు పెట్టేంత సీన్ లేదని చులకనగా మాట్లాడాడు.
జాన్వార్ మూవీలోని ఒక దృశ్యం
ఏడ్చేసిన అక్షయ్
ఆ విషయం నాతో చెప్తూ అక్షయ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి చలించిపోయిన నేను జుహులో అక్షయ్ కుమార్ జాన్వార్ సినిమా బ్యానర్ పెద్దది పెట్టించాను. ఇకపోతే జాన్వార్ కొన్నిచోట్ల 100 రోజులు ఆడితే మరికొన్నిచోట్ల పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో నేను నిరాశ చెంది నా నెక్స్ట్ సినిమాను హృతిక్ రోషన్‌తో తీస్తున్నానని అక్షయ్ పొరపడ్డాడు. నేను అలాంటిదేం లేదని క్లారిటీ ఇవ్వడంతో అతడితోనే 100 సినిమాలు తీయమని కోరాడు' అని చెప్పుకొచ్చాడు.
కాంబినేషన్ రిపీట్
జాన్వార్ హిట్ సాధించిన తర్వాత అక్షయ్- సునీల్ కాంబినేషన్‌లో ఏక్ రిష్తా, తలాష్: ద హంట్ బిగిన్స్, దోస్తి: ఫ్రెండ్స్ ఫరెవర్, మేరే జీవన్ సాతి చిత్రాలు తెరకెక్కాయి. అక్షయ్.. హా మైనే బీ ప్యార్ కియా, అండాజ్ సినిమాలకు దర్శన్ నిర్మాతగానూ వ్యవహరించాడు.
చదవండి: వెండితెర అద్భుత దృశ్య కావ్యం...తొలి పాన్ ఇండియా చిత్రం
Comments
Please login to add a commentAdd a comment