బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్, అక్షయ్ కుమార్.. ఒకరంటే ఒకరికి ఇష్టం. ‘మొహ్రా’ సినిమా సెట్స్‌లో. రవీనా బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌నెస్‌కి ఫిదా అయ్యాడు అక్షయ్. ఉరకలేసే అతని ఉత్సాహానికి మనసిచ్చేసింది రవీనా. ఆ ప్రేమను రహస్యంగా ఉంచలేదు ఆ జంట.‘ఇద్దరూ పంజాబీలే. ఈడుజోడూ బాగుంది’ అని వాళ్లను చూసి ముచ్చట పడింది బాలీవుడ్ ఇండస్ట్రీ. అందురూ అనుకుంటున్న విధంగానే వారు పెళ్లి వార్త చెప్పారు. కానీ పెళ్లి తర్వాత రవీనా సినిమాలు చేయకూడదనే కండీషన్ పెట్టాడు అక్షయ్.. ఎందుకంటే.. తనను గృహిణిగానే ఉండాలని కోరుకున్నాడు అక్షయ్.
కొన్నిరోజుల తర్వాత వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత అక్షయ్ మీద పలు వదంతులు వచ్చాయి. అతను మరో హీరోయిన్‌కు దగ్గరగా ఉంటున్నాడని ఆమెకు తెలిసింది. అక్షయ్ కోరిక మేరకు అప్పటికే రవీనా సినిమాలు ఆపేసింది. అలాంటి సమయంలో అక్షయ్‌పై రూమర్స్ రావడంతో బ్రేకప్ చేప్పేసి మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించింది.
ఆత్మహత్య అంటూ తప్పుడు కథనాలు
తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు డిజిటల్ యుగంలో ఎక్కువయ్యాయని రవీనా తెలిపింది. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 90వ దశకంలో ఒక పత్రిక తన అనారోగ్యాన్ని ఆత్మహత్యాయత్నంగా తప్పుగా నివేదించిందని రవీనా టాండన్ పేర్కొంది. చిత్ర పరిశ్రమలో తన ప్రతిష్టను దిగజార్చడంతో ఒక బాధాకరమైన అనుభవాన్ని కలిగించిందని తెలిపింది. 'అక్షయ్‌తో బ్రేకప్ జరగడం వల్లే నేను ఆత్మహత్యకు ప్రయత్నించానని పరోక్షంగా తప్పుడు కథనాలు రాసింది. ఆ సమయంలో నాకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. దీంతో సుమారు 20 రోజులపాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకున్నాను. ఓ రకంగా ఆ వార్తలతో నా సినిమా కెరియర్ కూడా దెబ్బతినింది. నేను ఆత్మహత్య చేసుకునే రకం కాదు.. జీవితంలో పోరాడే రకం.' అని ఆమె చెప్పింది.
ఇతరులపై గర్ల్‌ఫ్రెండ్‌ని ప్రయోగిస్తారు
'1990లలో నటీనటుల మధ్య పోటీ చాలా ఎక్కువగానే ఉండేది. కానీ సెట్లో హీరోహీరోయిన్ల నటన, అఫైర్లు, వివాదాల గురించి చెప్పుకుంటూ సరదాగ అందరం మాట్లాడుకునే వాళ్లం. కానీ కొన్నిసార్లు ఇది శృతి మించి పోయే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైతే తమ కెరీర్ పట్ల అభద్రతా భావంతో ఉంటారో వారందరూ కూడా ఇతరుల విజయాన్ని ఓర్వలేకపోయేవాళ్లు. అలాంటి వారిలో కొందరు ఇతర నటీమణులను కిందికి లాగాలని ప్రయత్నించేవారు.
అందుకోసం వాళ్ల బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ని ఇతరులపై ప్రయోగించేవాళ్లు. ఇలాంటి పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నాను. అలాంటి వారి వల్ల పలు ఇబ్బందులు కూడా పడ్డాను. అయితే నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా ఎవరి అవకాశాలను నిలువరించలేదు. ఎవరి మనసూ గాయపరచలేదు. ఎవరినీ సినిమాలోంచి తీసేయించాలని ప్రయత్నించలేదు. నాకు తెలియకుండా అలా జరిగి ఉంటే క్షమాపణ చెప్పడానికి ఇప్పటికీ నేను రెడీ’ అని చెప్పారు.
నా ఎఫైర్స్ గురించి పిల్లలకు చెప్పాను
2004లో బిజినెస్‌మెన్ అనిల్ తడానీని పెళ్లి చేసుకుంది. వీరికి రాశా, రణ్‌బీర్ వర్దన్ సంతానం. పెళ్లికి ముందే 1995లో ఇద్దరు చిన్నారుల(పూజ, ఛాయ)ను దత్తత తీసుకుని వారికి తల్లయింది రవీనా. అయితే తన పిల్లల దగ్గర గతంలోని ప్రేమకథలతో సహా ఏదీ దాచనంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా ఎఫైర్స్ గురించి పేపర్లో కథలు కథలుగా రాస్తారు. అలాంటప్పుడు నేను తప్పించుకోలేను. అది చూసి నా పిల్లలు కంగారుపడొద్దు. అందుకే పత్రికలవారికంటే ముందే నేనే అన్ని నిజాలు పిల్లలకు చెప్పేస్తూ ఉంటాను. ఒకవేళ నేను చెప్పకుండా దాస్తే ఆ విషయం ఈరోజు కాకపోయినా రేపైనా ఎలాగోలా తెలిసిపోతుంది. అప్పుడు పరిస్థితులు దారుణంగా మారుతాయి.
Comments
Please login to add a commentAdd a comment