జాలీ రైడ్‌ | Akshay Kumar starts shooting for Jolly LLB 3 with Arshad Warsi in Ajmer | Sakshi
Sakshi News home page

జాలీ రైడ్‌

Published Fri, May 3 2024 12:57 AM | Last Updated on Fri, May 3 2024 12:57 AM

Akshay Kumar starts shooting for Jolly LLB 3 with Arshad Warsi in Ajmer

బాలీవుడ్‌ హిట్‌ మూవీ ఫ్రాంచైజీలో ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే విడుదలైన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’, ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’ సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి థర్డ్‌ పార్ట్‌ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’ సినిమా రానుంది. ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ ఫ్రాంచైజీలోని తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన సుభాష్‌ కపూరే మూడో భాగాన్నీ తెరకెక్కిస్తున్నారు.

అక్షయ్‌ కుమార్, అర్షద్‌ వార్షి లీడ్‌ రోల్స్‌ చేస్తున్న ఈ సినిమాలో సౌరభ్‌ శుక్లా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు అక్షయ్‌ కుమార్‌. ‘‘ఒరిజినల్‌ ఎవరో, డూప్లికేట్‌ ఎవరో తెలియడం లేదు. కానీ ఈ సినిమా మాత్రం ఓ జాలీ రైడ్‌గా ఉండబోతోంది’’ అంటూ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’ సినిమా షూటింగ్‌లో తాను పాల్గొంటున్నట్లుగా వీడియోను షేర్‌ చేశారు అక్షయ్‌ కుమార్‌. నకిలీ లాయర్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement