
అక్షయ్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో
‘ఆయన సూపర్‌స్టార్‌డమ్ గురించి చెప్పుకొనే కథలు వింటూ పెరిగాను. అలాంటి వ్యక్తి ముద్దుల కూతురిని పెళ్లి చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు. ఇంత గొప్ప కానుక ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటాను. మీ ఇద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ తన మామగారైన సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నా, తన భార్య ట్వంకిల్ ఖన్నాకు విషెస్ తెలియజేశారు.
ఇక ట్వింకిల్ ఖన్నా పుట్టిన రోజు కూడా ఈరోజే కావడం విశేషం. ఈ క్రమంలో తన తండ్రి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ట్వింకిల్...‘ నా పుట్టినరోజు మా ఇంటికి ట్రక్కుల కొద్దీ పూల బొకేలు వచ్చేవి. నిజానికి అవి మా నాన్న కోసం వచ్చినవి. చిన్నపిల్లగా ఉన్నపుడు అవన్నీ నాకోసం వచ్చినవే అని మురిసిపోయేదాన్ని’ అంటూ క్యాప్షన్ జతచేశారు.
కాగా భారతీయ సినీ రంగంలో తొలి సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నటుడు రాజేశ్‌ఖన్నా జయంతి నేడు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన క్యాన్సర్ బారిన పడి 2012లో కన్నుమూశారు. బాలీవుడ్ నటి డింపుల్ కపాడియాను పెళ్లాడిన రాజేశ్ ఖన్నాకు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా హీరో అక్షయ్‌కుమార్‌ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం రచయిత్రిగా, నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment