
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్షయ్ భార్య, హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేశారు. ‘‘ఆల్ ఈజ్ వెల్.. అక్షయ్ బాగా కోలుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు ట్వింకిల్. ఈ నెల 4న తాను కోవిడ్ బారినపడ్డట్లు వెల్లడించారు అక్షయ్. ఆ మరుసటి రోజే వైద్యుల సలహా మేరకు అక్షయ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. సోమవారం అక్షయ్‌కు కరోనా నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు.
త్వరలో ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని ఊహించవచ్చు. ‘బచ్చన్ పాండే, బెల్ బాటమ్, అత్రంగి రే’ సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసిన అక్షయ్ ప్రస్తుతం ‘రామసేతు’, ‘పృథ్వీరాజ్’, ‘రక్షాబంధన్ ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘రామసేతు’ షూటింగ్ సమయంలోనే అక్షయ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఈ నెలలో విడుదల కావాల్సిన అక్షయ్ కుమార్ ‘సూర్యవన్షీ’ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
చదవండి:
దీపికా రాజీనామా!
Comments
Please login to add a commentAdd a comment