చిన్నపిల్లలు ఎంతో సున్నిత మనస్కులు. కాస్త కోపంగా చూస్తేనే చిన్నబుచ్చుకుంటారు. అలాంటిది ఎవరైనా ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేరు. కానీ కొందరు నోటికి ఎంతొస్తే అంత అనేస్తుంటారు. అలా బంధువు అన్న మాటలకు తన కూతురు నొచ్చుకుందని చెప్తోంది స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి, నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా.
శరీరం ట్యాన్ అవుతోందని..
నా కూతురు నితార స్విమ్మింగ్ క్లాసులకు వెళ్లేది. కానీ ఓసారి సడన్‌గా క్లాసులకు వెళ్లడం మానేస్తానంది. ఎండలో ట్యాన్ అయిపోయి శరీరం నల్లగా అవుతోందని చెప్పింది. అన్నయ్య (ఆరవ్) ఎంత తెల్లగా ఉన్నాడో నేనూ అలాగే అవుతానని చెప్పింది. తనకలాంటి ఆలోచన రావడానికి కారణం.. మా బంధువే! నీ పాప చాలా క్యూట్‌గా ఉంది కానీ ఆమె ఆరవ్ అంత తెల్లగా లేదు అని తెలివితక్కువగా మాట్లాడింది. ఆ మాటలు నా కూతురు విని బాధపడింది.
అది చదివాకే మార్పు
రంగు ముఖ్యం కాదని తనకెలా చెప్పాలా? అనుకున్నాను. ఫ్రిదా ఖలో బయోగ్రఫీని ఆమె చేతికిచ్చాను. ఖలో ఒక మెక్సికన్ పెయింటర్. మనిషి శరీరం, ఐడెంటిటీ, మరణం, వ్యక్తిత్వం.. ఇలా ఎన్నింటినో అందులో చర్చించింది. ఆ పుస్తకం చదివాక నితార ఆలోచనలో మార్పు వచ్చింది. తెలుపు అనేది లైట్ కలర్.. నా టీషర్ట్‌లాగా త్వరగా మురికిపడుతుంది. అదే బ్రౌన్.. కాస్త డార్క్ కలర్.. అంత ఈజీగా మురికిపడదు అని నితార ఫీలైంది అని ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చింది.
చదవండి: నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు
Comments
Please login to add a commentAdd a comment