కళ్లబడ్డాడు | Twinkle Khanna Reveals Son Aarav Has Her Number Saved As Police | Sakshi
Sakshi News home page

కళ్లబడ్డాడు

Published Fri, Jan 24 2020 2:57 AM | Last Updated on Fri, Jan 24 2020 2:57 AM

Twinkle Khanna Reveals Son Aarav Has Her Number Saved As Police - Sakshi

ట్వింకిల్‌ ఖన్నా కొడుకు పెద్దయ్యాడు! మరీ పదిహేడేళ్లకే పెద్దవాడు కాకున్నా.. తను పెద్దవాడిని అయ్యాననే అతడు అనుకుంటున్నాడు కాబట్టి, అతడి ఫీలింగ్‌ని గౌరవించాల్సిందే. అతడికున్న ఒక ఫీలింగ్‌.. మమ్మీ ఎప్పుడూ తనపై ఒక కన్నేసి ఉంచుతుందని! ఆ ఫీలింగ్‌ని కూడా ట్వింకిల్‌ గౌరవిస్తున్నారు. ట్వింకిల్‌ కొడుకు పేరు ఆరవ్‌. అతడి ఫోన్‌ కాంటాక్ట్స్‌లో ‘మమ్మీ’ అని ఉండాల్సిన చోట ‘పోలీస్‌’ అని ఉండటాన్ని ఎలాగో ఆమె ఈ మధ్య గమనించారు.

తనపై కొడుక్కి ఉన్న అభిప్రాయం ఆమెకు నవ్వు తెప్పించినట్లే ఉంది. ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు ట్వింకిల్‌. అలాగే ఓ పోలీస్‌ వ్యాన్‌ ముందు నిలబడి రెండు చేతులు ఎత్తి బలం చూపిస్తున్నట్లున్న తన ఫొటోని ఆ పోస్ట్‌కి జత చేశారు ట్వింకిల్‌. ‘ఆరవ్‌ ఫోన్‌లో నా కాంటాక్ట్‌కి ఈ ఫొటోను డిస్‌ప్లే పిక్‌గా పెట్టుకుంటే ఇంకా కరెక్టుగా ఉంటుంది’’ అని కామెంట్‌ కూడా రాశారు. ఇదీ ఒక రకమైన పుత్రోత్సాహమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement