
బాలీవుడ్ యాక్షన్ ఖిలాడి అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాల గారాల పట్టి నితారా ఆరవ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కూతురికి విషెస్ చెబుతూ అక్కీ చేసిన పోస్టు నెటిజన్ల మనసుల్ని దోచుకుంటోంది.
కూతురితో పాటు స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అక్షయ్... ‘ నా చిట్టితల్లి.. నాపై ఎంతో ప్రేమను కురిపిస్తున్నావు. నీవల్ల ఎంత సంతోషంగా ఉన్నానో నాకే తెలుసు. ప్లీజ్ నువ్విలాగే ఉండు. నా సాయం లేకుండా నీకు నీవుగా స్విమ్మింగ్ ఫూల్‌లో అడుగుపెట్టేంత పెద్దదానివి కావొద్దు. హ్యాపీ బర్త్‌డే మై ప్రిన్సెస్’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. అంతే ఇక పది లక్షలకు పైగా లైకులతో అక్కీ పోస్టు వైరల్‌గా మారింది. దీంతో నితారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అక్కీ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment