
'ఆయనే నా ఎడిటర్'
ముంబై: తన రచనలకు తన భర్త అక్షయ్ కుమారే ఎడిటర్ అని రచయిత్రిగా మారిన నటి ట్వింకిల్ ఖన్నా తెలిపారు. తన మొదటి పుస్తకం 'మిసెస్ ఫన్నీబోన్స్: షీజ్ జస్ట్ లైక్ యూ అండ్ ఏ లాట్ లైక్ మీ హియర్'ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్వింకిల్ విలేకరులతో ముచ్చటించారు. చిన్నప్పటి నుంచి రాయడం తనకు అలవాటు అని చెప్పారు. గత రెండేళ్లు కాలమ్స్ రాస్తున్నానని తెలిపారు.
మీ రచనల్లో అక్షయ్ జోక్యం చేసుకుంటారా అని విలేకరుల ప్రశ్నించగా... 'ఆయనే నా ఎడిటర్' అంటూ సమాధానం ఇచ్చారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి డింపుల్ కపాడియా, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, జయా బచ్చన్, సుసానె రోషన్, సొనాలి బింద్రే హాజరయ్యారు. సమాజంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తన శైలిలో 'మిసెస్ ఫన్నీబోన్స్' కాలమ్ లో ట్వింకిల్ ఖన్నా రాస్తున్నారు. ఆమె రాస్తున్న కాలమ్ ముంబైలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.