
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ కన్నా తన అభిరుచులను సోషల్ మీడియాలో పంచుకుంటూ నెటిజన్లను అలరిస్తుంటారు. పుస్తకాలు చదవడం అంటే ట్వింకల్ కన్నాకు ఎంతో ఇష్టం. తాజాగా టీనేజ్ ప్రేమికుల ఇతివృత్తంతో ‘ఫ్రెంచ్ ఎగ్జిట్’ అనే పుస్తకాన్ని ట్వింకల్ కన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే ఈ పుస్తకంలో టీనేజ్ యువత మైండ్‌సెట్, వ్యక్తిత్వం తదితర అంశాలను రచయిత చక్కగా వివరించినట్లు తెలిపింది.
కేవలం ఫ్రెంచ్ ఎగ్జిట్ పుస్తకం మాత్రమే కాకుండా ‘ది వార్ నెక్స్ట్ డోర్’ అనే పుస్తకాన్ని కూడా ట్వింకల్ కన్నా నెటిజన్లకు సూచించారు. కాగా తన కూతురుతో కలిసి పుస్తకాలను చదవుతానని, పిల్లలకు సంబంధించిన పుస్తకాలను చదవడం వల్ల పిల్లల వ్యక్తిత్వం తెలుసుకోవచ్చని తెలిపారు. కాగా టాలీవుడ్‌లో వెంకటేశ్ హీరోగా ‘శ్రీను’ సినిమాలో ట్వింకల్ కన్నా హీరోయిన్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అనేక బాలీవుడ్ సీనిమాలలో ట్వింకల్ కన్నా హీరోయిన్‌గా నటించారు.
చదవండి: నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను!
Comments
Please login to add a commentAdd a comment