బాలీవుడ్ రుస్తుం అక్షయ్ తన డాన్స్తో అందరికీ థాంక్స్ చెబుతున్నాడు. ఇటీవల రిలీజైన 'రుస్తుం' టాక్ మాట ఎలా ఉన్నా, వసూళ్ల పరంగా మాత్రం దూసుకెళుతోంది. రుస్తుం రిలీజ్కు ముందు బీ-టౌన్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, అలియా భట్ తదితరులు షార్ట్ వీడియోలు రూపొందించి రుస్తుం సినిమాను ప్రమోట్ చేస్తూ అక్షయ్ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఇప్పుడు తన వంతు అంటున్నాడు అక్షయ్. మీరు చూపించిన ప్రేమకు థాంక్స్ మాత్రమే చెబితే సరిపోదంటూ.. చిన్న డ్యాన్స్ వీడియోను రూపొందించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అలాగే 'రుస్తుం'ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు తన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు.